40ల్లోనే అస‌లైన మజా: విద్యాబాల‌న్‌

Vidya Balan says women get better with age
Wednesday, January 30, 2019 - 13:00

ఇటీవల "ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు" సినిమాలో బ‌స‌వ‌తార‌కం పాత్ర పోషించిన విద్యాబాల‌న్ 40ల్లోకి అడుగుపెట్టింది. 40 అంటే ఆంటీ పాత్ర‌లు త‌ప్ప భామ పాత్ర‌లు ద‌క్క‌వు. కానీ త‌న‌కి ఆ ఇబ్బంది లేదంటోంది. స్త్రీలు ఏజ్ పెరుగుతుంటే బెట‌ర్‌గా అవుతుంటారని అని చెపుతోంది విద్య‌.

ఫిల్మ్‌ఫేర్ మేగ‌జైన్‌కి ఇంట‌ర్వ్యూ ఇచ్చింది. ఆ ప‌త్రిక కోసం సెక్సీగా ఫోటోసూట్ చేసింది. నా ఫ్రెండ్ ఒక‌రు అన్నారు. 35 దాటిన త‌ర్వాత స్త్రీలు ఇత‌రుల మెప్పు పొందాల‌నుకోరు. వారి గురించే ఆలోచిస్తారు. ఇది సూప‌ర్‌గా ఉంటుంది. ఇత‌రుల అంచ‌నాలు అందుకోవ‌డం, మెప్పు పొందుకోవాల‌నుకునే ద‌శ 35 త‌ర్వాత ఎండ్ అవుతుంది. 40ల్లో ఇది ఇంకా బాగుంటుంది.

అంతేకాదు, అన్ని ర‌కాలుగా మ‌జా ఉంటుంద‌ని నొక్కి మ‌రీ చెపుతోంది. అర్థం చేసుకోవాలి మ‌రి మ‌నం.

ఇంత‌కీ ఆమె "ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు" సినిమా ప్ర‌చారానికి వ‌స్తుందా? "ఎన్టీఆర్ క‌థానాకుడు" సినిమా ఆమెతో మొద‌లైంది. బ‌స‌వ‌తార‌కం పాత్ర‌తోనే సినిమా షురూ అయింది. రెండో భాగం బ‌స‌వ‌తార‌కం పాత్ర మ‌ర‌ణంతో ముగుస్తుంద‌నేది టాక్‌. అంటే రెండో భాగంలోనూ విద్యాబాల‌న్ క‌నిపిస్తుంది. మ‌రి మొద‌టి భాగం అట్ట‌ర్‌ఫ్లాప్ అయింది కాబ‌ట్టి ఇపుడు ఆమె సినిమా ప్ర‌మోష‌న్‌కి వ‌స్తుందా? మొద‌టి భాగాన్ని ఆమె హైద‌రాబాద్‌లోని భ్ర‌మ‌రాంభ థియేట‌ర్లో ఉద‌యాన్నే 6 గంట‌ల‌కి అభిమానుల స‌మ‌క్షంలో చూసింది. కానీ ఫ‌లితం మాత్రం తేడా కొట్టింది. మ‌రి ఇపుడు ఆమె చేస్తుందనేది చూడాలి.