తెలుగు రాష్ట్రాలకు విజయ్ విరాళం

Vijay announces donation to Telugu states
Wednesday, April 22, 2020 - 15:00

తమిళ సూపర్ స్టార్ విజయ్ రూ.1.3 కోట్లు భారీ విరాళాన్ని ప్రకటించారు. కరోనా నివారించేందుకు ప్రభుత్వాలు తీసుకుంటున్న  మద్దతుగా తన వంతుగా కేంద్రం మరియు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు విరాళాన్ని ప్ర‌క‌టించారు. 

ఈ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5ల‌క్ష‌లు అంటే రెండు రాష్ట్రాల‌కు రూ.10 ల‌క్ష‌ల విరాళంతో పాటు ప్రధాన మంత్రి సహాయ నిధి కి రూ. 25 లక్షలు, తమిళనాడు ముఖ్యమంత్రి నిధికి రూ. 50 లక్షలు, కేరళ సహాయ నిధికి రూ. 10 లక్షలు, కర్ణాటక మరియు పుదుచ్చేరి రాష్ట్రాల సహాయ నిధులకు చెరో రూ. 5 లక్షలు, ఫెఫ్సి అసోసియేషన్ నిధికి రూ. 25 లక్షలు ప్రకటించారు.

విజయ్ నటించిన 'మాస్టర్' సినిమా విడుదుల కరోనా లక్డౌన్ వల్ల ఆగింది. ఈ సినిమాని తెలుగులో మహేష్ కోనేరు రిలీజ్ చెయ్యనున్నారు.