బిచ్చ‌గాడి హీరో ప‌రిస్థితి ఇలా మారింది

Vijay Antony lost total market in AP
Tuesday, June 4, 2019 - 20:00

"బిచ్చ‌గాడు" సినిమా తెలుగునాట ఒక సంచ‌ల‌నం సృష్టించింది. ఆ సినిమా తెలుగులో ఏకంగా 18 కోట్ల రూపాయ‌ల‌ను కొల్ల‌గొట్టింది. దాంతో "బిచ్చ‌గాడు" సినిమాలో న‌టించిన హీరో క‌మ్ సంగీత ద‌ర్శ‌కుడు విజ‌య్ ఆంటోనీ ప్ర‌తి త‌మిళ సినిమాని ఎగ‌బ‌డి కొన్నారు నిర్మాత‌లు, లోక‌ల్ బ‌య్య‌ర్లు. "బిచ్చ‌గాడు" సినిమా త‌ర్వాత మ‌రో మూడు నాలుగు సినిమాలు విడుద‌ల అయ్యాయి. కొన్న‌వారికి చిల్లులు ప‌డ్డాయి. దాంతో విజ‌య్ ఆంటోని సినిమాల వైపే చూపు వేయ‌డం లేదు.

తాజాగా "కిల్ల‌ర్" అనే సినిమాని ఈ వీకెండ్ విడుద‌ల చేస్తున్నాడు విజ‌య్ ఆంటోని. కానీ ఈ సినిమా రిలీజ్ అవుతున్న విష‌యం చాలా త‌క్కువ మందికి తెలుసు. ఆ రేంజ్‌కి దిగ‌జారింది ఈ హీరో ప‌రిస్థితి. బంగారు బాతుగుడ్డును ముందే కోసేసుకున్నాడు ఈ హీరో.