రౌడీ స్టార్ డాన్సులో వీకే!

Vijay Deverakonda admits he's weak in dance
Thursday, December 19, 2019 - 13:45

విజయ్ దేవరకొండకి యూత్ లో ఉన్న క్రేజ్ వేరు. డియర్ కామ్రేడ్ పెద్దగా ఆడక పోయినా అతని పాపులారిటీ ఇంచు కూడా తగ్గలేదు. నటనలో తోపు. అందంలోనూ సూపరహే. హీరో గా అన్ని లక్షణాలున్నా ...ఒక విషయంలో మాత్రం ఈ రౌడీ స్టార్ వీకే. డాన్సులో తాను ఈ జన్మలో గొప్పగా స్టెప్పులు వెయ్యలేను అని తానే బయట పెట్టాడు. ఎదో ఎదో చిన్న స్టెప్పుల వరకు ఒకే కానీ... డాన్స్ బేస్డ్ సినిమాలు వంటివి చెయ్యలేను అంటున్నాడు ఈ అందగాడు. 
స్ట్రీట్ డాన్సర్ త్రీడీ అనే హిందీ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేస్తూ  ఈ మాట చెప్పాడు విజయ్ దేవరకొండ. 

ప్రస్తుతం విజయ్ ... వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది ఫిబ్రవరి 14న విడుదల కానుంది.