అంద‌ర్నీ దాటేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda crosses all stars in Tollywood
Saturday, May 18, 2019 - 00:30

ప్ర‌భాస్‌కి నేష‌న‌ల్ లెవ‌ల్లో ఒక క్రేజ్ ఉంది. బీహార్ అయినా, క‌శ్మీర్ అయినా....ప్ర‌భాస్ అంటే గుర్తు ప‌డుతారు, ప‌డిచ‌స్తారు. బాహుబ‌లి సినిమాల‌తో ఖాన్ హీరోల‌ని మించి పోయాడు. ఆ రేంజ్‌లో క్రేజ్ ఉంది ప్ర‌భాస్‌కి. ఐతే ఇదంతా బాహుబ‌లి సినిమాల వ‌ల్లే వ‌చ్చింది. 

విజ‌య్ దేవ‌ర‌కొండ‌కి అది లేదు. విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన సినిమా ఏదీ హిందీలొ డ‌బ్ అయి పెద్ద హిట్ కాలేదు. బాహుబ‌లి రేంజ్ హిట్ కాదు క‌దా పెళ్లి చూపులు రేంజ్ హిట్ కూడా బాలీవుడ్‌లో లేదు. మ‌రి ఇలాంటి హీరో జాతీయ స్థాయిలో ఎలా క్రేజ్ తెచ్చుకున్నాడు? స సింపుల్ కాలేజ్ కుర్రాళ్ల‌ల్లో అభిమానం సంపాదించుకోవ‌డమే. హిందీ సినిమాల్లో న‌టించ‌క‌పోయినా...నేడు బాలీవుడ్ మీడియాలోనూ, బాలీవుడ్ తార‌ల్లోనూ విజ‌య్ దేవ‌ర‌కొండ పేరు న‌లుగుతోంది. ప‌లువురు బాలీవుడ్ భామ‌లు విజ‌య్ దేవ‌ర‌కొండ అందం గురించి, న‌ట‌న గురించి పొగిడారు.

అత‌నికి ఇంత పాపులారిటీ ఏర్ప‌డ‌డం విశేషమే. అంద‌గాడిగా యూత్‌లో అర్బ‌న్ ఏరియాస్‌లో క్రేజ్ ఉండ‌డం గ్రేట్‌. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియా... జాతీయ స్థాయిలో ది మోస్ట్ డిజైర‌బుల్ మెన్ లిస్ట్ ప్ర‌క‌టించింది. అందులో జాతీయ స్థాయిలో నాలుగో స్థానం పొందాడు. ఇక ప్ర‌భాస్‌కి టాప్ 12 ప్లేస్‌లో స్థానం ద‌క్కింది. అంటే ప్ర‌భాస్‌ని కూడా మించిపోయాడు డిజైర్‌బుల్ లిస్ట్‌లో. 

టాలీవుడ్ హీరోల వ‌ర‌కు అందం, డిజైరుబుల్ విష‌యాల్లో ప్ర‌భాస్‌, మ‌హేష్ వంటి అంద‌గాళ్ల‌ని దాటిపోయాడు ఈ కుర్ర అర్జున్‌రెడ్డి హీరో.