నా సినిమా చూడాలంటే ఓపిక ఉండాలి

Vijay Deverakonda on movie reviews
Saturday, July 27, 2019 - 11:30

నిన్న రిలీజైన డియర్ కామ్రేడ్ సినిమాకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాను చూడాలనుకుంటే కాస్త ఓపిక కావాలంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఓపిగ్గా చూస్తే సినిమా కచ్చితంగా నచ్చుతుందంటున్నాడు

"సినిమా థియేటర్లను నింపుతున్న నా కామ్రేడ్స్ అందరికీ థ్యాంక్స్. సినిమా కాస్త స్లోగా ఉన్నప్పటికీ ఇది బ్యూటిఫుల్ ఫిలిం. కంపల్సరీ వెళ్లి చూడండి. ఇలాంటి సినిమాలు చూడాలన్నా, మెచ్చుకోవాలన్నా కాస్త ఓపిక ఉండాలి. నేను చెప్పినట్టు చూస్తే మీకు సినిమా కచ్చితంగా నచ్చుతుంది." 

సినిమాకు సంబంధించి వచ్చిన ప్రతి రివ్యూ, ప్రతి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని ప్రకటించాడు విజయ్ దేవరకొండ. లైఫ్ జర్నీకి సంబంధించిన ఈ కథను ఇలానే చెప్పాలని అందుకే కాస్త స్లో గా అనిపిస్తుందని ఒప్పుకున్నాడు.

"ప్రతి ఒక్కరి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. ఈ కథను ఇలానే చెప్పాలి. లిల్లీ, బాబి నాలుగేళ్ల లైఫ్ జర్నీని చెప్పినప్పుడు ఇలానే ఉంటుంది. అందుకే సినిమా కాస్త స్లోగా ఉన్న భావన కలుగుతుంది. కాకినాడ సక్సెస్ మీట్ లో మరిన్ని వివరాలు మాట్లాడతా." 

సినిమాకు మంచి వసూళ్లు రావడంతో ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంది యూనిట్. ఈ మీటింగ్ లో హీరోతో పాటు హీరోయిన్ రష్మిక, దర్శకుడు, నిర్మాతలు పాల్గొన్నారు.