కొత్త‌కే ఓటు: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda prefers new talent
Monday, April 15, 2019 - 17:15

కొత్త దర్శకులకే ఓటేస్తానంటున్నాడు విజయ్ దేవరకొండ. పెద్ద దర్శకుల వెంట పడాల్సిన అవసరం లేదు, వారంతట వారు ఆఫర్ ఇస్తే చూస్తాను తప్ప పెద్ద దర్శకులను తాను అప్రోచ్ కానుంటున్నాడు.

ప్రస్తుతం "డియర్ కామ్రేడ్"లో కొత్త డైరక్టర్ భరత్ కమ్మని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఆ తర్వాత మరో కొత్త దర్శకుడిగా ఓకే చెప్పాడు.

ఆనంద్ అన్నామలై అనే తమిళ దర్శకుడిని పరిచయం చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. క్రాంతి మాధవ్ డైరక్షన్‌లోనూ ఒక మూవీ చేస్తున్నాడు. ఐతే క్రాంతి మాధవ్ ఇంకా స్టార్ డైరక్టర్ స్టేటస్ అందుకోలేదు. ఏ విధంగా చూసినా... విజయ్ దేవరకొండ.. కథని నమ్మి సినిమా చేస్తున్నాడు తప్ప బడా దర్శకుల వెంట పడడం లేదు.

"డియర్ కామ్రేడ్" వచ్చే నెల 31న విడుదల కానుంది.