విజయ్ మళ్ళీ గూగ్లీ వేశాడు

Vijay Deverakonda winning hearts with TDF
Monday, April 27, 2020 - 10:00

చిరంజీవి, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, నాని... ఇలా హీరోలు అందరూ డొనేషన్ల మీద డొనేషన్లు ఇచ్చారు. వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నారు. వారి గొప్ప మనసుకు అందరూ అభినందనలు తెలిపారు. అదే టైంలో పైసా విదల్చకుండా సైలెంట్ గా ఉన్న విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ షురూ అయింది. ఐనా కూడా విజయ్ పట్టించుకోలేదు... పోలీసులతో ఇంటరాక్షన్ వంటివి చేస్తూ వెళ్ళాడు.

ఇక విజయ్ డొనేషన్ చెయ్యడు అని అందరూ ఫిక్స్ అయిన టైంలో గూగ్లీ విసిరాడు. విజయ్ దేవరకొండ ఏకంగా కోటి 30 లక్షల వరకు సాయం అందించేందుకు ముందుకొచ్చాడు. అది కూడా వినూత్న పంథాలో. విజయ్ ఎలా సాయం చెయ్యబోతున్నాడో... విడియోలో చెప్పాడు. అంతే.. ఇప్పుడు అతనికి ప్రశంసలే ప్రశంసలు. దర్శకుడు కొరటాల సహా పలువురు సెలబ్రిటీలు విజయ్ ని పొగడ్తల్లో ముంచెత్తడమే కాదు అతనికి అండగా ఉండేందుకు ముందుకొచ్చారు.

కార్తికేయ వంటి యువ హీరోలు కూడా లక్ష రూపాయలు దానం చేసి... అతనితో పాటు తాము కూడా హెల్ప్ చేస్తామంటూ ముందుకొచ్చారు.

సో రౌడీ హీరో దేవరకొండ మరోసారి ప్రత్యేకత చాటుకున్నాడు.