క్రిష్‌కి దూరం, రైటర్ కి చేరువగా!

Vijayendra Prasad working on Kangana's biopic
Friday, March 15, 2019 - 18:15

రాజమౌళి తండ్రి రాసిన స్క్రిప్ట్ ఆధారంగానే మణికర్ణిక సినిమా రూపొందింది. ఈ సినిమాని దర్శకుడు క్రిష్ కి సెట్ చేసింది కూడా విజయేంద్ర ప్రసాద్. ఐతే మణికర్ణిక సినిమా వల్ల క్రిష్‌కి, కంగనకి గొడవ అయింది. ఇపుడు వీరిద్దరూ బద్ద శత్రువులు అనుకోవచ్చు. ఆ రేంజ్లో ఇద్దరి మధ్య ఫైట్ జరిగింది.

కంగనా రనౌత్ కి క్రిష్ మీద కోపం ఉంది కానీ రచయిత విజయేంద్ర ప్రసాద్ పై మాత్రం చాలా నమ్మకం, గౌరవం ఉందట. అందుకే, బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ కి ఆమె తన బయోపిక్ స్క్రిప్ట్ పని అప్పచెప్పింది.

కంగన తన జీవితాన్ని సినిమాగా తీసుకుంటుందట. తన బయోపిక్‌ని తనే రూపొందించుకుంటోంది. ఆమె జీవితంలోని అన్ని విషయాలను ఈ బయోపిక్ లో చూపిస్తారట. ఈ ఏడాది చివర్లో బయోపిక్ షూటింగ్ మొదలవుతుందట. ఆమె లైఫ్ అంతా స్టడీ చేశానని త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తవుతుందంటున్నారు విజయేంద్రప్రసాద్.