విజయ్ సినిమా ఈసారి తక్కువకే

Vijay's next bagged by Mahesh Koneru
Saturday, December 28, 2019 - 16:30

విజయ్ హీరోగా నటించిన 'విజిల్' సినిమా తెలుగులో 11 కోట్ల వరకు షేర్ సాధించింది. ఆ సినిమా హక్కులు తొమ్మిదిన్నర కోట్లకి కొన్నారు నిర్మాత మహేష్ కోనేరు. అందులో పెద్దగా ఏమీ మిగల్లేదు. ఐతే తనకి తెలుగులో మంచి ప్రమోషన్ చేసినందుకు విజయ్ సంతోషపడ్డాడు. అందుకే నెక్స్ట్ మూవీ హక్కులు మహేష్ కోనేరుకే  ఇప్పించాడు విజయ్. ఈ సినిమా రైట్స్ ఎనిమిదిన్నర కోట్లకు దక్కాయి. విజయ్ కొత్త సినిమాని 'ఖైదీ' సినిమా దర్శకుడు లోకేష్ కానగరాజు  తీస్తున్నాడు. 

ఈ దర్శకుడు తీసే సినిమాలు భిన్నంగా ఉంటాయి. ఖైదీ వంటి మంచి సినిమా తర్వాత ఆ దర్శకుడు తీస్తున్న సినిమా కాబట్టి అంచనాలు పెట్టుకోవచ్చు. గతంలో విజయ్ సినిమాలని తెలుగులో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు బాగానే ఆడుతున్నాయి. అదిరింది, విజిల్ సినిమాలతో విజయ్ ట్రాక్ మారింది.