రాజ‌కీయాల‌కి దూరంగా ఉండ‌ను: విజ‌య‌శాంతి

Vijayshanti will continue politics as well
Monday, June 3, 2019 - 15:30

ఫైర్‌బ్రాండ్ విజ‌య‌శాంతి దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత సినిమా కోసం మేక‌ప్ వేసుకుంటున్నారు. గ‌త ప‌దిహేనేళ్లుగా ఆమె సినిమాలు చేయ‌లేదు. రాజ‌కీయాల్లోనే బిజీగా ఉన్నారు. ఇపుడు సెకండ్ ఇన్నింగ్స్‌ని మ‌హేష్‌బాబు హీరోగా రూపొందుతోన్న "స‌రిలేరు నీకెవ్వ‌రు" చిత్రంతో షురూ చేస్తున్నారు. ఐతే సినిమాల కోసం రాజ‌కీయాల‌ను వ‌దులుకోన‌ని ప్ర‌క‌టించారు. 

ఇన్నేళ్ల తర్వాత మళ్లీ సినిమాల్లోకి వ‌స్తున్నాను కాబ‌ట్టి స‌హ‌జంగా కొందరికి అనుమానాలు రావొచ్చని విజయశాంతి అన్నారు. "ఐతే నేనుఒక విషయం స్పష్టం చేయదలచుకున్నాను. నాకు సినిమాల్లో నటించే అవకాశం ఆరు నెలల కిందటే వచ్చింది. కానీ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు కాంగ్రెస్ హై కమాండ్ నాకు స్టార్ క్యాంపెయినర్, ప్రచార కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించింది. సో నేను అప్పుడు ఒప్పుకోలేదు. ఇపుడు న‌టిస్తాను. మ‌ళ్లీ ఏ బాధ్య‌త అప్ప‌గించినా చేస్తాను. రాజకీయాల‌కి దూరంగా ఉండ‌బోను," అని స్ప‌ష్టం చేశారు.

విజ‌య‌శాంతి వ‌చ్చే నెల నుంచి "స‌రిలేరు నీకెవ్వ‌రు" షూటింగ్‌లో పాల్గొంటారు. ప్ర‌స్తుతం ఆమె బ‌రువు త‌గ్గుతున్నారు. అనిల్‌రావిపూడి డైర‌క్ష‌న్‌లో రూపొందుతోన్న ఈ మూవీలో ర‌ష్మిక హీరోయిన్‌. విజ‌య‌శాంతిది ఒక ఉదాత్త‌మైన కీల‌క పాత్ర‌.