నాని గ్యాంగ్‌లీడ‌ర్ అవుతున్నాడా?

vikram Kumar and Nani's film titled Gang Leader?
Sunday, February 24, 2019 (All day)

నాని ఇపుడు బిజీ బిజీగా ఉన్నాడు. ఒక‌వైపు "జెర్సీ" విడుద‌ల‌కి రెడీ అవుతోంది మ‌రోవైపు విక్ర‌మ్‌కుమార్ సినిమా షూటింగ్‌లో ఉన్నాడు నాని. ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 24) నాని పుట్టిన రోజు. ఈ బ‌ర్త్‌డే సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని నాని నిర్మాత‌లు కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్నారు. మ‌రికొంద‌రు టైటిల్స్ అనౌన్స్ చేస్తున్నారు.

విక్ర‌మ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని ప్ర‌స్తుతం న‌టిస్తున్న మూవీకి "గ్యాంగ్‌లీడ‌ర్" అనే పేరు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్లే అని టాక్‌. సినిమా క‌థ ప్ర‌కారం ఈ టైటిల్ సూట్ అవుతుంద‌ట‌. 1991లో విడుద‌లైన "గ్యాంగ్‌లీడ‌ర్" చిరంజీవి కెరియ‌ర్‌లో అప్ప‌ట్లో వెరీ బిగ్ హిట్‌. ఆ సినిమా పేరునే ఇపుడు వాడుకుంటున్నాడు నాని. 

ఈ సినిమాలో అయిదుగురు లేడీ క్యార‌క్టర్స్ ఉంటాయి. వారితో నానికి ఎలాంటి రిలేష‌న్ ఉంటుంది, వారికి హీరో గ్యాంగ్ లీడ‌ర్ ఎలా అవుతాడ‌నేది క‌థ‌. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర‌లో "ఆర్ ఎక్స్ 100" హీరో కార్తీకేయ న‌టిస్తున్నాడు. అయిదుగురు మ‌హిళ‌ల పాత్ర‌ల‌కి ఇప్ప‌టికే ముగ్గురు కొత్త వారిని ఫిక్స్ చేశారు. 

ఈ రోజు సాయంత్రం ఐదు గంట‌ల‌కి టైటిల్‌ని అనౌన్స్ చేస్తామ‌ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. మ‌రి ఇదే టైటిల్ ఉంటుందా? లేక వేరేదైనా పేరుని అనౌన్స్ చేస్తారా? లెట్స్ సీ.