పోలీసుల‌కి హీరో విక్ర‌మ్ రిక్వెస్ట్‌!?

Vikram requests TN police to not file case on his son Dhruv?
Tuesday, August 14, 2018 (All day)

త‌మిళ హీరో విక్ర‌మ్ కుమారుడు ధృవ్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. "వ‌ర్మ" అనే పేరుతో బాల డైర‌క్ష‌న్‌లో న‌టిస్తున్నాడు ధృవ్‌. తెలుగులో సూప‌ర్‌హిట్ట‌యిన "అర్జున్‌రెడ్డి"కి రీమేక్ అది. ఈ సినిమా షూటింగ్ ఊపందుకోలేదు అపుడే ధృవ్ క్రైమ్ వార్త‌ల్లో నిలిచాడు. 

ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇరుక్కున్నాడు. ఒక ఆటోని గుద్ది, ఆ డ్రైవ‌ర్‌ని గాయ‌ప‌ర్చాడు. చెన్నై పోలీసులు అత‌నిపై కేసు బుక్ చేశారు. మొద‌ట అరెస్ట్ చేసి, ఆ త‌ర్వాత బెయిల్‌పై విడుద‌ల చేశారు. ఆదివారం తెల్ల‌వారుఝామున స్పీడ్‌గా కారు డ్రైవ్ చేస్తుండ‌గా, స్టీరింగ్ అదుపుత‌ప్ప‌డంతో ఒక ఆటోని ఢీకొట్టాడు ధృవ్. ఈ విష‌యంలో విక్ర‌మ్ ఇంకా స్పందించ‌లేదు కానీ అత‌ను ఇలా స్పందించాడంటూ ఒక మెసేజ్ స‌ర్క్యులేట్ అవుతోంది. అదేంటంటే...

"నా కుమారుడు బాల తీస్తున్న వ‌ర్మ సినిమా పాత్ర కోసం ఆల్క‌హాలిక్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆల్క‌హాలిక్ వ్య‌క్తి ప్ర‌వ‌ర్త‌న ఎలా ఉండాలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నా లాగే పాత్ర‌లో ఇమిడిపోవాల‌నుకుంటున్నాడు. కాబ‌ట్టి దీన్ని అర్థం చేసుకొని త‌మిళ‌నాడు పోలీసులు నా కొడుకుపై కేసు పెట్టొద్ద‌ని రిక్వెస్ట్ చేస్తున్నా," అని త‌న వివ‌ర‌ణ ఇచ్చాడంటూ ఒక మెసేజ్ విక్ర‌మ్ పేరుతో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంత‌కీ ఇదేంటి అనుకుంటున్నారా. అదేనండి ట్రోలింగ్‌.

విక్ర‌మ్ కుమారుడు సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్ట‌క‌ముందే తాగి డ్రైవ్ చేసి కేసులో ఇరుక్కోవ‌డంతో..విక్ర‌మ్‌ని ఆట‌ప‌ట్టిస్తూ ఇలా ట్రాల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. మొద‌ట చాలా మంది విక్ర‌మ్ ఇలా స్పందించాడు ఏంటి అని క‌నుఫ్యూజ్ అయ్యారు. ఆ త‌ర్వాత ఇది ట్రాల్ అని గ్ర‌హించి అంద‌రూ న‌వ్వ‌డం మొద‌లుపెట్టారు.