విక్ర‌మ్ పూర్తిగా ఔట్‌డేటెడ్ అయ్యాడా?

Vikram's KK gets bad reviews
Friday, July 19, 2019 - 20:15

విక్ర‌మ్ న‌టించిన మిస్ట‌ర్ "కేకే" కూడా ఢ‌మాల్‌. ఈ సినిమాకి తెలుగునాట క‌నీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఇక సినిమాని చూసిన ఒక‌రో ఇద్ద‌రో క్రిటిక్స్ కూడా చీల్చి చెండాడారు. న‌టుడిగా మ‌న దేశంలో ఉన్న గొప్ప న‌టుల్లో ఒక‌రు విక్ర‌మ్‌. అంత గొప్ప ప్ర‌తిభ పెట్టుకొని ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడో అర్థం కావ‌డం లేద‌ని త‌మిళ క్రిటిక్స్ కూడా పెద‌వి విరిచారు. ఆయ‌న ఆలోచ‌న‌ల‌న్నీ ఔట్‌డేటెడ్ అయిపోయాయా అన్న అనుమానాలూ మొద‌ల‌య్యాయి.

విక్ర‌మ్ న‌టించిన మిస్ట‌ర్ కేకే సినిమాని క‌మ‌ల్‌హాస‌న్ నిర్మించాడు. క‌మ‌ల్ హాస‌న్ కూతురు అక్ష‌ర హాస‌న్ ఒక కీల‌క పాత్ర పోషించింది. ఈ సినిమాని త‌న కోసమే రాయించుకున్నాను అని క‌మ‌ల్ ఇంత‌కుముందు చెప్పాడు. తాను చేయాల్సిన పాత్ర‌ని విక్ర‌మ్‌కి ఇచ్చాడ‌ట‌. కానీ సినిమా చూసిన త‌ర్వాత అస‌లు ఇది క‌మ‌ల్ కానీ, విక్ర‌మ్ కానీ ఎందుకు ఒప్పుకున్నారో అని తిట్టుకుంటున్నారు.

విక్ర‌మ్ ఖాతాలో ఇది మ‌రో బ‌డా ఫ్లాప్‌.