విశాఖ థియేట‌ర్లు అమ్మేసిన వినాయ‌క్‌

Vinayak's theaters bought
Thursday, December 27, 2018 - 23:45

విశాఖ‌ప‌ట్నంలో జ‌గ‌దాంబ థియేట‌ర్ల త‌ర్వాత అంత‌గా పేరు తెచ్చుకున్న థియేట‌ర్ కాంప్లెక్స్‌. దానికి కార‌ణం వినాయ‌క్‌. వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌కుడిగా టాప్ రేంజ్‌లో ఉన్న‌పుడు రెండు పాత థియేట‌ర్ల‌ను కొన్నాడు. వైజాగ్‌లోని ఆ థియేట‌ర్ల‌లో ఆధునాత‌న వ‌స‌తుల‌ను ఏర్పాటు చేసి విమాక్స్ పేరుతో బాగా పేరు తీసుకొచ్చాడు. త‌క్కువ టైమ్‌లోనే మేజ‌ర్ స్పాట్‌గా మారాయి ఆ థియేట‌ర్లు. ఐతే ఇపుడు ఆ థియేట‌ర్లు క‌నుమ‌రుగు కానున్నాయి.

ఒక పెద్ద కార్పోరేట్ కంపెనీకి ఆ థియేటర్ కాంప్లెక్స్ ను అమ్మేశాడ‌ట‌. ఆ సంస్థ అక్క‌డ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించ‌నుంది. అంటే ఆ థియేట‌ర్ మూత‌బ‌డ‌నుంది. అంతే కాదు త్వ‌ర‌లోనే కూల్చేస్తారట‌. వి.వి.వినాయ‌క్‌కి ఈ మ‌ధ్య ఫ్లాప్స్ ఎక్కువ‌గా ఎదుర‌య్యాయి. ఐతే ఆర్థిక క‌ష్టాలున్నాయ‌నుకుంటే పొర‌పాటు. టాలీవుడ్‌లో అత్యంత ధ‌న‌వంతుడైన ఫిల్మ్‌మేక‌ర్స్‌లో వినాయ‌క్ ఒక‌రు. అద్భుత‌మైన ఫైనాన్సియ‌ల్ ప్లానింగ్‌తో వెల్ఆఫ్ అయ్యాడు.

మంచి రేట్ ప‌ల‌క‌డంతో, ఇన్వెస్ట్‌మెంట్ మీద మంచి రాబ‌డ‌ని ఈ థియేట‌ర్ల‌ను అమ్మేశారు త‌ప్ప ఆర్థిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కాదు.