టెంప‌ర్‌ని డ‌బ్ చేయ‌డ‌మేంటో!

Vishal Ayogya releases in Telugu
Sunday, May 26, 2019 - 00:15

విశాల్ న‌టించిన ప్ర‌తి త‌మిళ సినిమా తెలుగులోకి డ‌బ్ అవుతుంద‌నేది వాస్త‌వ‌మే. ఐతే "అయోగ్య" అనే సినిమాని మాత్రం తెలుగులో రిలీజ్ చేయ‌ను అని విశాల్ ఇంత‌కుముందే ప్ర‌క‌టించాడు. ఎందుకంటే...అది "టెంప‌ర్" సినిమాకి రీమేక్‌. తెలుగులో జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా పూరి తీసిన టెంప‌ర్ మంచి విజ‌యం సాధించింది. ఎన్టీఆర్‌కి న‌టుడిగా ఎంతో పేరు తెచ్చింది. 

ఈ సినిమాని ఇటీవ‌లే బాలీవుడ్‌లో "సింబా" పేరుతో రీమేక్ చేశారు. అక్క‌డా హిట్ట‌యింది. ఇక త‌మిళంలో "అయోగ్య" పేరుతో విశాల్ రీమేక్ చేశాడు. ఎలాగూ తెలుగు క‌థ‌తోనే సినిమాని తీశాను కాబ‌ట్టి తెలుగులో డ‌బ్ చేయ‌న‌ని విశాల్ ఇంత‌కుముందు ప్ర‌క‌టించాడు. ఐతే.. ఆయ‌న స‌రైన నిర్ణ‌యం తీసుకున్నా... మ‌న తెలుగు మేక‌ర్స్ మాత్రం బుర్ర పెట్ట‌డం లేదు. తాజాగా ఓ నిర్మాత ఈ సినిమా తెలుగు డ‌బ్బింగ్ రైట్స్ తీసుకున్నారు.తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం  చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు.

ఇది మ‌న తెలుగు వారి స్ట‌యిల్‌. తెలుగు సినిమాని ప‌ర‌భాష‌లో రీమేక్ చేస్తే..మ‌ళ్లీ దాన్ని తెలుగులో డ‌బ్ చేస్తారంట‌.