డిటెక్టివ్ డైరెక్టర్ పై విశాల్ ఫైర్

Vishal directing Detective 2
Wednesday, March 11, 2020 - 17:00

విశాల్ నటించిన "డిటెక్టివ్" (తమిళంలో 'తుప్పరివాళన్') మంచి విజయం సాధించింది. దానికి మిస్కిన్ దర్శకుడు. తమిళ చిత్రసీమలో క్రియేటివ్ గా తీసే దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు మిస్కీన్. ఐతే, ఆయన సినిమాలు కాసులు తీసుకురావు. పెట్టిన డబ్బులు వస్తే అదే పెద్ద విజయం. కానీ ఆయన డిమాండ్లు మాత్రం మామూలుగా ఉండవు అంటున్నాడు విశాల్. 

విశాల్ తన స్వంత బ్యానర్ పై "డిటెక్టివ్" సినిమాకి సీక్వెల్ గా "డిటెక్టివ్ 2" మొదలు పెట్టాడు. కానీ రెండు షెడ్యూల్స్ పూర్తి అయిన తర్వాత.. విశాల్ కి జ్ఞానోదయం కలిగింది. ఈ దర్శకుడు అనవసర ఖర్చు పెట్టిస్తున్నారు అని తెలుసుకున్నాడు. ఖర్చు తగ్గించాలని కోరారు అంట విశాల్. కానీ దానికి మిస్కిన్ ఒప్పుకోలేదు. దాంతో వొళ్ళు మండిన విశాల్ ... దర్శకుడిని తప్పించారు. తానే డైరెక్ట్ చేస్తున్నట్లు ఈ రోజు విశాల్  అనౌన్స్ చేశాడు. 

విశాల్ చేసిన ఆరోపణలు 

సినిమాకి పారితోషికంగా 5 కోట్లు డిమాండ్ చేశాడు మిస్కిన్
సినిమా మొదలు పెట్టిన తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ కోసం టైం తీసుకున్నాడు
ఒక రోజు ఒక షాట్ మాత్రమే తీస్తాను అన్నట్లు ప్రవర్తించాడు 
మరో నిర్మాత ఇలాంటివాళ్ళకి బలి కావొద్దు