విశాల్ పెళ్లి ముహూర్తం ఇదే

Vishal fixes wedding date
Saturday, May 11, 2019 - 23:30

త‌మిళ హీరో విశాల్ న‌టించిన అయోగ్య సినిమా ఎట్ట‌కేల‌కి శ‌నివారం విడుద‌లైంది. అనేక సార్లు వాయిదాప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. శుక్ర‌వారం టికెట్లు కొన్న‌వారికి రిఫండ్ ఇచ్చారు. మొత్తానికి శ‌నివారం మ‌ధ్యాహ్నం నుంచి రిలీజైంది. దాంతో విశాల్ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ ఆనందంలో త‌న పెళ్లి గురించి వివ‌రాలు బ‌య‌ట‌పెట్టాడు. 

అక్టోబ‌ర్ 9న త‌న పెళ్లి జ‌ర‌గ‌బోతోంద‌ని వెల్ల‌డించాడు. ఆళ్ల అనీషా రెడ్డి అనే హైద‌రాబాద్ అమ్మాయిని ప్రేమించాడు విశాల్‌. వీరిద్ద‌రి నిశ్చితార్థం ఇటీవ‌లే జ‌రిగింది. ఐతే విశాల్‌కి ప్ర‌స్తుతం త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలో క‌ష్టాలు ఎక్కువ‌య్యాయి. నిర్మాత‌ల మండలిలోనూ, సినిమా తార‌ల సంఘంలోనూ అత‌నికి శ‌త్రువులెక్కువ‌య్యారు. అత‌న్ని పొలిటిక‌ల్‌గా టార్గెట్ చేశారు. అందుకే పెళ్లి ముహూర్తం అంత లేట్‌గా పెట్టుకున్నాడు.