విశాల్‌కి పొగ‌బెట్టిన పొలిటిక‌ల్ పార్టీ

Vishal slammed over smoking poster
Tuesday, November 20, 2018 - 23:15

ఒక‌పుడు ర‌జ‌నీకాంత్ తెగ సిగ‌రెట్లు కాల్చేవాడు. ఆయ‌న సినిమాల్లోనూ, సినిమా పోస్ట‌ర్స్‌లోనూ స్మోకింగ్ దృశ్యాలుండేవి. ఐతే ర‌జ‌నీకాంత్ ఆ త‌ర్వాత త‌న సినిమా పోస్ట‌ర్స్‌పై సిగ‌రెట్ కాల్చే ఫోటోలుండ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడు. త‌న సినిమాల్లోనూ సిగ‌రెట్ సీన్లు క‌ట్ చేసి, చూయింగ్ గ‌మ్‌, రూపాయి బిల్ల‌ల‌తో ర‌క‌ర‌కాల విన్యాసాలు చేసే సీన్ల‌ని యాడ్ చేశాడు. 

ఈ క‌థ అంతా ఎందుకంటే.. త‌మిళ‌నాట స్మోకింగ్‌, డ్రింకింగ్ పోస్ట‌ర్స్ అనేవి కొత్త ట్రెండ్ కాదు. ఐతే ఇపుడు హీరోలు కొంత బాధ్యతాయుతంగా ఉంటున్నారు. అలాంటివి అవాయిడ్ చేస్తున్నారు. తాజాగా విశాల్ బీర్ బాటిల్ ప‌ట్టుకొని తొలి లుక్‌లో ఫోజు ఇవ్వ‌డం వివాదంగా మారింది. విశాల్ హీరోగా న‌టిస్తున్న "అయోగ్య" సినిమా తొలి లుక్ విడుద‌లైంది. ఇది మ‌న తెలుగు మూవీ "టెంప‌ర్‌"కి రీమేక్‌. ఈ  సినిమా పోస్ట‌ర్‌లో విశాల్ పోలీసు జీపుపై బీరుబాటిల్ పట్టుకుని కూర్చుని కనిపించాడు. ఇదే ఇపుడు వివాదాన్ని రాజేస్తోంది. 

ధూమ‌పానం, మద్యపానంపై పోరాడుతున్న పిఎంకె పార్టీ అధ్య‌క్షుడు రాందాస్ విశాల్ పై విరుచుకు పడ్డారు. ఫ్యాన్స్‌కి ఏమి సందేశం ఇస్తున్నారు ఈ ఫోటోతో అని ఆయ‌న మండిప‌డుతున్నారు. విశాల్ పొద్దున లేవ‌గానే నీతి సూత్రాలు వ‌ల్లిస్తుంటాడు..పోస్ట‌ర్స్‌ల‌లో ఇలాంటివా అంటూ ఆయ‌న విమ‌ర్శిస్తున్నారు.