విన‌య విధేయ రామ విల‌న్ పిచ్చి చేష్ట‌

Vivek Oberoi's response to Aishwarya Rai meme controversy
Monday, May 20, 2019 - 23:45

వివేక్ ఒబెరాయ్ గురించి ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. పాపుల‌ర్ న‌టుడే. బాలీవుడ్ సినిమాలు అంత‌గా చూడ‌ని వారికి కూడా రీసెంట్‌గా విడుద‌లైన తెలుగు మూవీ విన‌య విధేయ‌రామ‌తో ప‌రిచ‌యం అయి ఉంటాడు. చ‌ర‌ణ్ న‌టించిన ఈ మూవీలో విల‌న్‌గా క‌నిపించాడు వివేక్ ఒబెరాయ్‌. 

ఒక‌పుడు బాలీవుడ్‌లో సంచ‌ల‌న హీరో అత‌ను. స‌ల్మాన్‌ఖాన్‌ని ప్రేమించిన ఐశ్వ‌ర్య‌రాయ్ అత‌ని వ‌య‌లెంట్ బిహేవ‌ర్‌కి త‌ట్టుకోలేక బ్రేక‌ప్ చెప్పింది. ఆ టైమ్‌లో వివేక్ ఒబేరాయ్‌తో కొన్నాళ్లూ డేటింగ్ చేసింది. ఐతే వీరి బంధం కూడా ఎక్కువ కాలం కొన‌సాగ‌లేదు. ఫైన‌ల్‌గా అమితాబ్ బ‌చ్చ‌న్ కుమారుడు అభిషేక్ బ‌చ్చ‌న్‌ని పెళ్లాడి జీవితంలో సెటిల్ అయింది. పాస్ట్ గురించి అంద‌రూ మ‌రిచిపోయారు. 

ఇదంతా ఉపోద్ఘాతం ఎందుకంటే... తాజాగా ట్విట్ట‌ర్‌లో ఎవ‌రో ఒక మీమ్ (ఫ‌న్నీగా ఉండే ఇమేజ్‌లు) పోస్ట్ చేశాడు. అందులో ఏమి ఉందంటే.. స‌ల్మాన్‌ఖాన్‌తో ఐశ్వ‌ర్య క‌లిసి ఉన్న సంద‌ర్భం..ఒపినీయ‌న్ పోల్ వంటిది, వివేక్ ఒబెరాయ్‌తో ఐష్ ఉన్న‌ప్ప‌టి కాలం ఎగ్జిట్ పోల్ వంటింద‌ట‌. ఇక అస‌లైన ఫ‌లితాలు... ఐశ్వ‌ర్య-అభిషేక్ క‌లిసి ఉన్న ఫోటో అని మీమ్‌లో ఉంది. దీన్ని వివేక్ ఒబెరాయ్ షేర్ చేశాడు. దీనిపై దుమారం రేగుతోంది. 

త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్‌ని లాగ‌డం ఏంట‌ని దుమారం రేగుతోంది. పెళ్ల‌యి, ఓ పాప‌కి త‌ల్లి అయిన ఆమె గురించి, ఆమె పాత ప్రేమ‌ల గురించి ప్ర‌స్తావించ‌డం ఎందుకు అని వివాదం రేగ‌డంతో వివేక్ ఒబెరాయ్ ధుమ‌ధుమ‌లాడుతున్నాడు. ఐతే ఈ విష‌యంలో తాను ఎవ‌రికీ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌న‌ని అంటున్నాడు.