మాకు మెహ్రీన్ వ‌ద్దు!

We don't need Mehreen, says Mahesh's fans
Thursday, March 7, 2019 - 10:15

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తొలి సినిమా..ప‌టాస్‌. ఆ సినిమాలో న‌టించిన శ్రుతి సోధికి త‌న రెండో సినిమా సుప్రీం సినిమాలో సాంగ్ చేయించాడు. సుప్రీం సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన రాశిఖ‌న్నాతో తన మూడో మూవీ రాజా ది గ్రేట్‌లో స్పెషల్ సాంగ్‌లో చూపించాడు. 

రాజా ది గ్రేట్‌లో న‌టించిన మెహ్రీన్‌ని త‌న నాలుగో చిత్రం ఎఫ్‌2లో రెండో హీరోయిన్‌గా న‌టింప చేశాడు. అంటే ప్ర‌తి హీరోయిన్‌ని త‌న త‌దుప‌రి చిత్రంలో ఏదో విధంగా రిపీట్ చేస్తాడు. ముఖ్యంగా మెహ్రీన్‌కి రెండుసార్లు హీరోయిన్‌గా అవ‌కాశం ఇచ్చాడు. దాంతో మ‌హేష్‌బాబు అభిమానులు.. ఈ సారి మెహ్రీన్‌ని ఐటెంగాల్‌గా కూడా రిపిట్ చేయొద్ద‌ని ట్విట్ట‌ర్‌లో స్పెష‌ల్ రిక్వెస్ట్‌లు పెడుతున్నారు.

అనిల్ రావిపూడి త‌దుప‌రి చిత్రం.. మ‌హేష్‌బాబు హీరోగానే. ఈ జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుంది. సాయి ప‌ల్ల‌విని హీరోయిన్‌గా తీసుకోవాల‌నేది అనిల్ రావిపూడి ఆలోచ‌న‌. ఏదో ఒక పాత్ర‌కో, పాట‌కో మెహ్రీన్‌ని తీసుకుంటారేమో..అలాంటి ప‌ని చేయ‌కండి బాబూ అంటూ రావిపూడికి బాబు అభిమానులు పోస్ట్‌లు పెడుతున్నారు.