వెంకీ కూతురు పెళ్లికి దారేది?

Wedding venue yet to be fixed for Aashrita
Saturday, February 9, 2019 - 17:00

విక్టరీ వెంకటేశ్ కూతురు అశ్రిత పెళ్లికి రంగం సిద్ధమైంది. రీసెంట్ గా అశ్రితకు, వినాయక్ రెడ్డికి నిశ్చితార్థం పూర్తయిన విషయం తెలిసిందే. వచ్చేనెలలో వీళ్ల వివాహం గ్రాండ్ గా జరగనుంది. అయితే పెళ్లి వేదికపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. సిటీలోనే పెళ్లి చేద్దామా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేద్దామా అనే అంశంపై దగ్గుబాటి కుటుంబంలో చర్చలు సాగుతున్నాయి.

ప్రస్తుతానికైతే నానక్ రామ్ గూడలో ఉన్న రామానాయుడు స్టుడియోస్ లో పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. కుటుంబంలో మరికొందరు మాత్రం జైపూర్ లేదా మరేదైనా దేశంలో పెళ్లి చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. త్వరలోనే పెళ్లి వేదికపై ఓ క్లారిటీకి రాబోతున్నారు.

హైదరాబాద్ రేస్ క్లబ్ ఛైర్మన్ సురేందర్ రెడ్డి మనవడే వినాయక్ రెడ్డి. అశ్రిత, వినాయక్ కొన్నేళ్లుగా ఒకరికొకరు బాగా తెలుసట. ఆ పరిచయమే ఇప్పుడు పెళ్లికి దారితీసిందంటున్నారు.