ఈసారి వీకెండ్ ముందే వస్తోంది

This weekend releases on Christamas
Tuesday, December 24, 2019 - 17:15

సాధారణంగా కొత్త సినిమాల కోసం శుక్రవారం వరకు ఎదురుచూడాలి. కానీ ఈసారి వీకెండ్ కాస్త ముందే వస్తోంది. అవును.. ఈ వారం సినిమాలన్నీ బుధవారమే (రేపు) రిలీజ్ అవుతున్నాయి. దీనికి కారణం క్రిస్మస్. ఈ పండగను దృష్టిలో పెట్టుకొని సినిమాల్ని వీకెండ్ కంటే చాలా ముందుగా విడుదల చేస్తున్నారు. ఇక ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాలు ఇద్దరి లోకం ఒకటే, మత్తు వదలరా.

నిజానికి జానర్ పరంగా ఈ రెండు సినిమాలకు ఎలాంటి సంబంధం లేదు. కాబట్టి వీటి మధ్య పోటీ తీయడం తప్పు. కాకపోతే ఇప్పటికే థియేటర్లలో పాతుకుపోయిన వెంకీమామ (రెవెన్యూ లేకపోయినా థియేటర్లలో ఉంది), ప్రతి రోజూ పండగే సినిమాలకు ఈ తాజా చిత్రాలు రెండూ ఎలాంటి పోటీనిస్తాయనేది క్వశ్చన్ మార్క్.

లాంగ్ గ్యాప్ తర్వాత ఇద్దరిలోకం ఒకటే సినిమాతో వస్తున్న రాజ్ తరుణ్. ఇదొక రీమేక్ మూవీ. ప్రేమకథ కాబట్టి హ్యాపీ ఎండింగ్ ఉంటుందని భ్రమ పడొద్దు. ఇదొక ఎమోషనల్ హార్ట్ టచింగ్ మూవీ. అర్థంకాలేదా.. బాధాకరమైన ఎండింగ్ అని అర్థం. ఇప్పటికే ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో చాలామంది స్టూడెంట్స్ చూశారు. ఓకే అనే టాక్ వచ్చింది. అసలు ఫలితం రేపు రాబోతోంది.

ఇక మత్తువదలరా అనే మరో సినిమా కూడా రేపు థియేటర్లలోకి వస్తోంది. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా, చిన్నకొడుకు శ్రీసింహా హీరోగా పరిచయమౌతున్న సినిమా ఇది. డిఫరెంట్ గా ప్రమోట్ చేయడానికి ట్రై చేసి ఉన్నంతలో సక్సెస్ అయ్యారు. రేపు రిలీజ్ అవుతున్న ఈ సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.