ఇంత‌కీ నాగ‌బాబుకి ఒరిగిందేమిటి?

What has Naga Babu achieved with his videos?
Friday, January 11, 2019 - 15:00

అపుడెపుడో బాల‌య్య చేసిన కామెంట్స్‌కి నాగ‌బాబు రీసెంట్‌గా సమాధానాలు ఇచ్చాడు. యూట్యూబ్‌లో రోజుకో కామెంట్‌తో బాల‌య్య‌ని టార్గెట్ చేశాడు. ఆరు ప్ర‌శ్న‌లు లేవ‌దీసి...వాటికి త‌న‌దైన రీతిలో బాల‌య్య‌కి కౌంట‌ర్లు ఇచ్చాడు. తాజాగా దీనికి ముగింపు ప‌లికాడు. చివరి వీడియోలో మ‌రింత ఘాటుగా మాట్లాడాడు. అంతేకాదు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చాడు. 

ఇక‌పై బాల‌య్య ఏం మాట్లాడినా..వెంట‌నే కౌంట‌ర్ ఇస్తాన‌న్నాడు. ఇదివరిలా మౌనం వ‌హించేది లేద‌న్నాడు. ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పడిన‌ట్లే అనేది చూడాలి. నాగ‌బాబు మాత్రం...ఈ ఎపిసోడ్‌కి ఇక్క‌డ ఎండ్‌కార్డ్ వేశాడు. ఐతే మ‌ళ్లీ బాల‌య్య ఎపుడు రియాక్ట్ అయినా.. చ‌ర్య‌కి ప్ర‌తిచ‌ర్య ఉంటుంద‌ట‌. ఐతే ఈ మొత్తం ఎపిసోడ్‌లో నాగ‌బాబు సాధించింది ఏంటి అంటే... బాల‌య్య ఏదీ మాట్లాడినా చిరంజీవి ఫ్యామిలీ సైలెంట్‌గా ఉంటుంద‌నే అపప్ర‌ధ‌ని తొల‌గించాడు. అంతేకాదు, నాగబాబు త్వ‌ర‌లోనే జ‌న‌సేన‌కి ప్ర‌త్య‌క్ష మ‌ద్ద‌తు ఇస్తాడ‌న్న హింట్ వ‌చ్చింది. 

చిరంజీవి అభిమానులు కొంద‌రు నాగ‌బాబు చ‌ర్య‌ల‌తో ఖుషీగా ఉన్నారు. మ‌రోవైపు, నందమూరి అభిమానులు మ‌ళ్లీ మెగాస్టార్ కుటుంబ హీరోల‌ను టార్గెట్ చేసే అవ‌కాశం క‌ల్పించాడు నాగ‌బాబు. దీనివ‌ల్ల నాగ‌బాబుకి ఎంత లాభం అనేది ప‌క్క‌న ప‌డితే ....ఎంతో కొంత పోల‌రైజేష‌న్ అయితే జ‌రిగింద‌ట‌.