ప్రియాకి ఆఫ‌ర్లు ఇక లేన‌ట్టేనా?

What is next in store for Priya Varrier
Tuesday, June 4, 2019 - 15:00

ఈ ఏడాది ప్రారంభంలో ప్రియా వారియ‌ర్ సృష్టించిన  క‌ల‌క‌లం అంతా ఇంతా కాదు. ఆమె హైద‌రాబాద్‌కి వ‌చ్చిన‌పుడు హీరోలంతా ఆమెతో న‌టించేందుకు ఎగ‌బడ్డారు. ఆమె న‌టించిన ల‌వ‌ర్స్ డే సినిమా ఈవెంట్‌కి అల్లు అర్జున్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ఆమె బ‌న్ని అభిమాని. ఆమె అందం చూసి... బ‌న్ని ఆమెకి త‌న కొత్త సినిమాలో ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. 

క‌ట్ చేస్తే...

ఇపుడు సీన్ మొత్తం మారింది. ల‌వ‌ర్స్ డే దారుణంగా ప‌రాజ‌యం పాలైంది. ఆ సినిమా చూసిన వారికి అర్థ‌మైంది ఏంటంటే ఆమెకి న‌యాపైసా యాక్టింగ్ రాద‌ని. దాంతో ఆమె ఒప్పుకుంటే కోటి రూపాయ‌ల పారితోషికం కూడా ఇస్తామ‌ని ఎగ‌బ‌డ్డ మేక‌ర్స్ అంతా ఇపుడు వెన‌క్కి త‌గ్గారు. ఆమెకి ఒక్క ఆఫ‌ర్ లేదిపుడు. తెలుగులోనే కాదు ఆమె మాతృభాష మ‌ల‌యాళంలోనూ ఇదే సీన్‌.