అంచనాలు పెంచుతున్నాడా.. తగ్గిస్తున్నాడా!

What Puri is doing with iSmart Shanka
Friday, July 12, 2019 - 22:30

మొన్నటివరకు స్టోరీలైనే సెంటరాఫ్ ఎట్రాక్షన్ అనుకున్నారు. ఆ స్టోరీ కాస్తా ముందే చెప్పేశాడు.  రామ్ గెటప్, మేనరిజమ్స్ హైలెట్ అనుకున్నారు. డైలాగ్స్ తో సహా వాటిని కూడా బయటపెట్టేశాడు. హీరోయిన్ల రోల్స్, వాళ్ల చేష్టలే సినిమాకు ప్లస్ అనుకున్నారు. ఆ సన్నివేశాలు కూడా ముందే రిలీజ్ చేశాడు. ఇలా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సంబంధించి ఏమాత్రం హైప్ ఇవ్వకుండా.. ఉన్నదంతా ముందే రిలీజ్ చేస్తున్నాడు పూరి జగన్నాధ్. 

దీంతో ఈ సినిమాపై పూరి జగన్నాధ్ అంచనాలు పెంచుతున్నాడా.. పెరిగిన అంచనాల్ని తగ్గిస్తున్నాడో అర్థంకావట్లేదు జనాలకి. 

మొన్ననే థియేట్రికల్ ట్రయిలర్ రిలీజ్ చేశాడు. అందులో రామ్, నిధి అగర్వాల్, నభా నటేష్ పాత్రలన్నీ పరిచయం చేశాడు. పనిలోపనిగా కథ కూడా అక్కడే చెప్పేశాడు. అందులోనే మొత్తం చెప్పేశాడనుకుంటే.. ఇపుడు రెండో ట్రయిలర్ కూడా రిలీజ్ చేశాడు. ఈసారి ఇంకాస్త ఎక్కువే చూపించేశాడు పూరి జగన్నాధ్.

అయితే పూరిని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. అన్నీ చూపించినట్టే అనిపిస్తుంది. అసలు కథ మాత్రం సినిమాలో ఉంటుంది. కాబట్టి ఇస్మార్ట్ కూడా అలాంటి మెరుపులు ఏవో ఉండే ఉంటాయని కొంతమంది ఫీలింగ్. ఇన్ సైడ్ టాక్ ప్రకారం.. సినిమాకు సంబంధించి వారణాసి ఎపిసోడ్ హైలెట్ అంట. ఆ ఎపిసోడ్ ను మాత్రం రిలీజ్ చేయడం లేదు.