ఇది వాపా బలుపా

What is the status of Housefull 4
Monday, October 28, 2019 - 19:45

ప్రచారంతో ఊదరగొట్టారు. దీపావళి పండగ కూడా కలిసొచ్చింది. దీంతో హౌజ్ ఫుల్ 4 సినిమాకు వసూళ్లు పోటెత్తాయి. అంతా బాగానే ఉంది కానీ, ఇది నిజంగానే సక్సెస్ అయిందా లేక ఫెస్టివ్ సీజన్ కు వీకెండ్ తోడవ్వడం వల్ల వచ్చిన వసూళ్లా అనే డౌట్ అందర్లో ఉంది. రేపటికి ఈ విషయం తేలిపోతుంది.

హౌజ్ ఫుల్ 4 సినిమాపై క్రిటిక్స్ ఎవ్వరూ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు. గడిచిన చిత్రాలతో పోలిస్తే ఇందులో ఎలాంటి కామెడీ లేదని కామెంట్ చేశారు. మరీ ముఖ్యంగా కామెడీ పేరుతో వెకిలివేషాలు, వెర్రితనం ఎక్కువగా కనిపించిందని దుయ్యబట్టారు. రేటింగ్స్ కూడా సోసోగానే పడ్డాయి. అందుకే ఈ సినిమా ఎన్ని రోజులు ఆడుతుంది, ఎంత కలెక్ట్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రివ్యూల్ని అధిగమించి ఈ సినిమా హిట్ అవుతుందా లేక రివ్యూల్లో చెప్పినట్టు 3-4 రోజులకే దుకాణం సర్దేస్తుందా అనే విషయం సోమ, మంగళవారం నాటి వసూళ్లతో తేలిపోతుంది. అన్నట్టు ఈ సినిమాకు ఈ 3 రోజుల్లో 53 కోట్ల 22 లక్షల రూపాయల నెట్ వచ్చింది. మొదటి రోజు రూ. 10.08 కోట్లు, శనివారం రూ. 18.81 కోట్లు, ఆదివారం రూ.15.33 కోట్ల రూపాయలు వచ్చాయి. సోమవారం, మంగళవారం నాటి వసూళ్లతో ఈ సినిమా జాతకం తేలిపోతుంది