రవితేజ కొత్త సినిమా టైటిల్ ఏంటి?

What is the title for Ravi Teja's next film?
Wednesday, November 7, 2018 - 21:00

త్వరలోనే వీఐ ఆనంద్ దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు రవితేజ. ఈ సినిమాకు ముందుగా టైటిల్ ఎనౌన్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తారు. దానికి సంబంధించిన తేదీని ఈరోజు ప్రకటించారు. 13వ తేదీన రవితేజ-వీఐ ఆనంద్ సినిమా టైటిల్ లోగోను విడుదల చేస్తారు. అదే రోజున సినిమా సెట్స్ పైకి వెళ్లే తేదీని కూడా ప్రకటిస్తారు.

ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తళ్లూరి నిర్మాతగా సైన్స్-ఫిక్షన్ సబ్జెక్ట్ తో ఈ సినిమా రాబోతోంది. తన కెరీర్ లో రవితేజ చేస్తున్న మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ సినిమా ఇదే. ఇందులో ఓ హీరోయిన్ గా నభా నటేష్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారు. ఆర్ఎక్స్-100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను మరో హీరోయిన్ గా తీసుకున్నారు. 

ఇందులో ఇంకో హీరోయిన్ కు కూడా స్థానం ఉంది. ఆమె పేరును త్వరలోనే ప్రకటించబోతున్నారు. డిసెంబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ ప్రాజెక్టుకు తమన్ సంగీత దర్శకుడు. ఈ సినిమాకు టైటిల్ గా డిస్కోరాజ్, డూప్లికేట్ లాంటి పేర్లను పరిశీలిస్తున్నారు. 13వ తేదీన ఈ టైటిల్ పై సస్పెన్స్ వీడనుంది.