త్రివిక్రమ్ స్ట్రాటజీ అర్థం కావట్లేదు

What is Trivikram's strategy?
Friday, September 27, 2019 - 19:45

త్రివిక్రమ్‌ ప్రమోషన్‌ స్టయిల్‌ మార్చేశాడా అనిపిస్తోంది ఆయన దూకుడు చూస్తుంటే. నిజానికి ఎంత పెద్ద సినిమాకైనా రెండు నెలల ముందే ప్రమోషన్‌ మొదలవుతుంది. కానీ సంక్రాంతికి విడుదలయ్యే సినిమాకి దసరా రాకముందే ప్రమోట్‌ చేస్తున్నాడు త్రివిక్రమ్‌. ఇది చాలా చిత్రంగా ఉంది. రేపు (సెప్టంబర్‌ 28) సామజవరగమణ పేరుతో తొలి పాట రానుంది అల వైకుంఠపురంలో సినిమా నుంచి. 

తమన్‌ కంపోజిషన్లో సిరివెన్నెల సీతారామాశాస్త్రి రాసిన ఈ పాటని సిద్‌ శ్రీరామ్‌ పాడాడు. తొలి పాట విడుదలైందంటే సినిమా పబ్లిసిటీ మొదలయినట్లు. 

ఇంత హడావుడిగా.. ఇంత ఎర్లీగా ప్రచారం ఎందుకు చేస్తున్నట్లు? త్రివిక్రమ్‌ కొత్త ప్లాన్‌ ఏంటి? ఇదే అందర్నీ వండర్‌ చేస్తోన్న పాయింట్‌. త్రివిక్రమ్‌ దూకుడు వెనుకున్న స్ట్రాటజీ ఏంటో మరి. లేక బన్ని తొందరపెడుతున్నాడా? ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 12ని రిలీజ్‌ డేట్‌గా ఫిక్స్‌ చేశారు. తాజాగా వినిపిస్తున్న గాసిప్స్‌ ప్రకారం ఆమె మహేష్‌బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు కూడా అదే రోజున రిలీజ్‌ అవ్వాలని అనుకుంటుందట. ఇప్పటి వరకు ఈ రెండు సినిమాల మధ్య రెండు రోజుల గ్యాప్‌ అయినా ఉంటుందనుకున్నారంతా. కానీ ఇపుడు డైరక్ట్‌ పోటీ  అన్నమాట. బహుశా త్రివిక్రమ్‌ అందుకే ఈ ప్రమోషన్‌ స్కెచ్‌ వేసి ఉంటారు. ముందు నుంచే హైప్‌ తీసుకొచ్చే ప్లాన్‌అన్నమాట.