బాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి ఫేట్ ఏంటి?

What will be the fate of Kabir Singh
Wednesday, April 24, 2019 - 10:15

బాలీవుడ్‌లో "అర్జున్ రెడ్డి" ఆడుతుందా లేదా? ఈ సినిమా రిజ‌ల్ట్‌తో టాలీవుడ్‌కి కూడా చాలా ప‌నుంది. "అర్జున్‌రెడ్డి" సినిమాతో ద‌ర్శ‌కుడు సందీప్ వంగా ఒక ఒరిజిన‌ల్ వాయిస్ ఉన్న ద‌ర్శ‌కుడిగా తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి డైర‌క్ట‌ర్ తెలుగులో మ‌రిన్ని సినిమాలు చేస్తే....టాలీవుడ్‌లో కొంత వైవిధ్యం క‌నిపిస్తుంది. అలాగే అత‌ని డైర‌క్ష‌న్‌లో సినిమా చేసేందుకు మ‌హేష్‌బాబు స‌హా ప‌లువురు బ‌డా స్టార్స్ ఇంత‌కుముందు ఆస‌క్తి చూపారు.

అక్క‌డ ఆ సినిమా ఆడితే.. వెంట‌నే సందీప్ వంగాకి అవ‌కాశం ఇస్తారు. లేదంటే వెయిట్ అండ్ సీ మోడ్‌లోకి వెళ్లిపోతారు.

షాహిద్ క‌పూర్ హీరోగా రూపొందుతోన్న బాలీవుడ్ మూవీ "క‌బీర్ సింగ్" ("అర్జున్‌రెడ్డి" రీమేక్‌) ఆడితే.. మ‌న తెలుగు ద‌ర్శ‌కుల‌కి బాలీవుడ్‌లో మంచి డిమాండ్ పెరుగుతుంది. సందీప్ వంగా నెక్స్ట్ కెరియ‌ర్‌పై కూడా క్లారిటీ వ‌స్తుంది. ఈ సినిమా ఫేట్ ఏంటో తెలియాలంటే జూన్ 21 వ‌ర‌కు ఆగాల్సిందే.