తమన్న, ప్రభుదేవా.. కుచ్ కుచ్!

What's cooking between Tamannah and Prabhudeva
Wednesday, April 17, 2019 - 16:00

ప్రభుదేవా మామూలోడు కాదు. అతను హీరోయిన్లతో ప్రణయ సంబంధాలు నెరుపుతూనే ఉన్నాడు. నయనతారతో ఆయన డీప్ లవ్ ఎఫైర్ గురించి అందరికీ తెలిసిందే. అంతకుముందు కూడా పలువురు హీరోయిన్లతో ఆయన రిలేషన్స్ నడిపాడు. తాజాగా ఈ హీరో కమ్ డ్యాన్సర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ డైరక్టర్ తమన్నతో చాలా క్లోజ్‌గా ఉంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమన్న, ప్రభుదేవా ఇంతకుముందు "అభినేత్రి" అనే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లోనే వీరి ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి కోలీవుడ్ చెవులు కొరుక్కొంది. ఇపుడు ఆ సినిమా సీక్వెల్లో నటించారు.

మే 1న రానుంది "అభినేత్రి 2". ఇపుడు వీరిద్దరి ఫ్రెండ్సప్ గురించి మరింతగా గాసిప్‌లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హో రహా హై?