మహేష్ ఆ 'ఇంకోటి' ఏంటి?

What's next after Parasuram's movie for Mahesh Babu
Sunday, April 26, 2020 - 13:00

మహేష్ బాబు నెక్స్ట్ సినిమా ఎదో తేలిపోయింది. రాజమౌళితో సినిమా కూడా లాక్ అయింది. మరి మధ్యలో కొంత టైం ఉంటుంది కదా. ఈ గ్యాప్లో ఎవరితో మూవీ చేస్తారు? సమాధానం లేని ఈ ప్రశ్నకు రకరకాల ఊహాగానాలే సమాధానాలుగా షికార్లు చేస్తున్నాయి. a కాకపోతే b, b కాకుంటే C అన్నట్లు అంచనాలు చేస్తున్నారు.

ఇప్పటివరకు పక్కాగా మహేష్ బాబు ఒప్పుకున్న మూవీ... పరశురామ్ డైరక్షన్ లో రూపొందిదే. ఇది కూడా ఇప్పటివరకు మహేష్ బాబు ఆఫీసియల్ గా ప్రకటించలేదు. కానీ ఈ ప్రాజెక్ట్ పై పెద్దగా సందేహాలు లేవు. పరశురామ్ సినిమా పూర్తి చేసిన తరువాత ఎలాగైనా ఒప్పించి త్రివిక్రమ్ తో మరో మూవీ చేయాలనుకుంటున్నాడు మహేష్ అని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ ఒప్పుకోకపోతే అనిల్ రావిపూడికి మళ్ళీ ఛాన్స్ ఇస్తాడని అంటున్నారు. కానీ ఇవన్నీ తేలాలి అంటే... ముందు పరశురామ్ సినిమా సెట్ కి ఎక్కి కనీసం సగ భాగం అయినా పూర్తి అవ్వాలి. ఈ లోపు "ఆర్.ఆర్.ఆర్" విడుదల గురించి కూడా క్లారిటీ రావాలి. అప్పటివరకు అన్ని ఊహాగానాలే. ఏదైనా జరగొచ్చు.

మహేష్ బాబు సినిమా సెట్ మీదకు వెళ్లే వరకు దేన్నీ నమ్మలేము. సుకుమార్, వంశీ పైడిపల్లి చిత్రాలు అధికారికంగా అనౌన్స్ అయి.. సైడ్ కి వెళ్లాయి. సో.. ఆ ఇంకోటి ఏంటి అనేది ఆన్సర్ లేని క్వశ్చన్.