చిరంజీవిని బిగ్ బి తొలిసారి ఎలా కలిశారు?

When did Chiru first meet Big B?
Saturday, September 28, 2019 - 17:30

ఇద్దరూ సూపర్ స్టార్స్. దశాబ్దాలుగా పరిశ్రమల్లో కొనసాగుతున్నారు. బాలీవుడ్ లో అమితాబ్ కు ఎంత పేరుందో, టాలీవుడ్ లో చిరంజీవికి కూడా అంతే పేరు ఉంది. ఇలాంటి ఇద్దరు లెజెండ్స్ కలిస్తే స్క్రీన్ కలర్ ఫుల్ గా ఉంటుంది. అయితే వీళ్లిద్దరి తొలి పరిచయం ఎలా జరిగింది? మొదటిసారి బిగ్ బి, చిరంజీవి ఏం మాట్లాడుకున్నారు?

ఈ ప్రశ్నలకు స్వయంగా అమితాబ్ సమాధానం చెప్పారు. ఊటీలో తొలిసారి చిరంజీవిని చూశానన్నారు. తను ఓ షూటింగ్ కోసం ఊటీ వెళ్లానని, తన లొకేషన్ కు పక్కనే చిరంజీవి సాంగ్ షూట్ చేస్తున్నారని తెలిపారు అమితాబ్. చిరంజీవిని చూసిన వెంటనే తనే వెళ్లి కలిశానని, కాసేపు మాట్లాడుకున్న తర్వాత చిరంజీవి వెళ్లి డాన్స్ మూమెంట్ చేశారని, ఆ డాన్స్ చూసి తనకు ఆశ్చర్యం వేసిందన్నారు అమితాబ్.

చిరంజీవి కొన్ని సెకెన్లలో వేసిన ఆ స్టెప్పును తను వేయాలంటే కనీసం రెండేళ్లయినా పడుతుందంటున్నారు అమితాబ్. ఇలా చిరంజీవిని తొలిసారి కలిసిన అనుభవాన్ని పంచుకున్నారు. సైరా ప్రమోషన్ లో భాగంగా చిరంజీవి, అమితాబ్ ను కలిపి ఇంటర్వ్యూ చేశాడు దర్శకనిర్మాత-నటుడు ఫర్హాన్ అక్తర్. ఈ సందర్భంగా బిగ్ బి ఈ ముచ్చటను బయటపెట్టారు. నార్త్ లో సైరాను డిస్ట్రిబ్యూట్ చేస్తోంది ఫర్హాన్ అక్తర్ కు చెందిన కంపెనీనే.