రెహ‌మాన్ త‌ప్పుని స‌రిదిద్దిన‌ ఇళ‌య‌రాజా

When Ilaiyaraaja corrects AR Rahman during a live performance
Monday, February 4, 2019 - 16:30

మ్యూజిక్ మేస్ట్రో ఇళ‌య‌రాజా 75 ఏళ్ల వేడుక‌ల‌ని త‌మిళ చిత్ర‌సీమ ఘ‌నంగా నిర్వ‌హించింది. ఇళ‌య‌రాజా కాన్స‌ర్ట్‌ని ఏర్పాటు చేసి స్వ‌ర సెల్యూట్ స‌మ‌ర్పించింది. ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల‌హాస‌న్ స‌హా సినిమా తార‌లంద‌రూ త‌ర‌లివ‌చ్చారు. ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, ఇళ‌య‌రాజా శిష్యుడు ఏ.ఆర్‌.రెహ‌మాన్ కూడా విచ్చేసి త‌న గురువు స్వ‌ర‌ప‌ర్చిన ఒక పాట‌ని త‌న కీబోర్డ్‌పై ప్ర‌ద‌ర్శించి అంద‌ర్ని అల‌రింప‌చేశారు.

ఇళ‌య‌రాజాకి రెహ‌మాన్ శిష్యుడు అయినప్పిటికీ..వారిద్ద‌రి అభిమానుల మ‌ధ్య చిరంజీవి, బాల‌య్య అభిమానుల రేంజ్‌లో గొడ‌వ‌లు సాగుతుంటాయి. రాజాకన్నా రెహ‌మాన్ గొప్ప‌వాడ‌ని రెహ‌మాన్ అభిమానులు అంటారు. రెహ‌మాన్‌..రాజా కాలిగోటికి ప‌నికిరాడ‌ని వీరు అంటారు. ఐతే ఇద్ద‌రూ గ్రేట్ మ్యూజిషియ‌న్స్‌, ఇద్ద‌రూ సంగీత స‌మ్రాట్‌ల అన్న విష‌యాన్ని ప‌ట్టించుకోరు. అభిమానుల మ‌ధ్య ఉన్న ఈ ర‌చ్చ కార‌ణంగానే రెహ‌మాన్‌..పెద్ద‌గా ఇళ‌య‌రాజా గురించి బ‌హిరంగంగా మాట్లాడాడు. కానీ ఈసారి త‌న గురువుని ఘ‌నంగా స‌న్మానించాడు. ట్విట్ట‌ర్‌లో ఒక ఫోటో కూడా పోస్ట్ చేశారు. 33 ఏళ్ల క్రితం ఇళ‌య‌రాజా వ‌ద్ద ప‌ని చేస్తున్న‌పుడు నోట్స్ రాసుకుంటున్న ఫోటోని.. నేటి ఫోటోని క‌లిపి షేర్ చేశారు రెహ‌మాన్‌. గొప్ప ఫీలింగ్ ఇది అని త‌న అభిమానాన్ని చాటుకున్నారు.

ఇక వేదిక‌పై రెహ‌మాన్‌.. రాజా స్వ‌ర‌ప‌ర్చిన మౌన‌రాగం మ‌ల్లెపూల చ‌ల్ల‌గాలి పాట‌ని ప్ర‌ద‌ర్శించారు. ఈ పాటని రెహ‌మాన్ కీబోర్డ్‌పై ప‌ర్‌ఫామ్ చేస్తున్న‌పుడు రాజా గొంతు క‌లిపి పాడారు. చివ‌ర్లో రెహ‌మాన్ ఒక నోట్ త‌ప్పు చేశాడ‌ని న‌వ్వుతూ అత‌నికి క‌రెక్ష‌న్ చెప్పడంతో..హాల్ అంతా న‌వ్వుల్లో ముంచెత్తింది. రెహ‌మాన్ కూడా.. ఇక్క‌డ కూడా టీచ‌ర్‌లాగే ఉన్నారా అంటూ న‌వ్వాపుకోలేక‌పోయారు.