మ‌హేష్ నెక్స్ట్ మూవీ లాంచ్ ఎపుడు?

When will be Mahesh's next launched
Thursday, May 23, 2019 - 01:00

మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం విదేశాల్లో ఉన్నాడు. మ‌రో 20 రోజుల వ‌ర‌కు హైద‌రాబాద్ రాడు. లాంగ్ హాలీడే తీసుకున్నాడు. స్కూళ్ల ఓపెనింగ్ టైమ్‌కి ఇండియాకి వ‌స్తాడు. 

మరి ఈ నెల 31న ఏమైనా ఈవెంట్ ఉంటుందా అని అభిమానులు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. త‌న తండ్రి పుట్టిన రోజు నాడు కొత్త సినిమా ప్ర‌క‌ట‌నో, తొలి లుక్కో విడుద‌ల చేయ‌డం ఒక మ‌హేష్‌బాబుకి ఒక అల‌వాటుగా మారింది. అభిమానులు కూడా ఆ రోజు ఏదో ఒక స్పెష‌ల్ ఉంటుంద‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. 

ఈ సారి త‌న నెక్స్ట్ మూవీని లాంచ్ చేస్తాడేమో అని భావిస్తున్నారు. మ‌హేష్‌బాబు లేకుండా సినిమాని లాంచ్ చేయ‌లేరు. సో.. ఆ రోజు అనిల్‌రావిపూడి డైర‌క్ష‌న్‌లో న‌టించే కొత్త సినిమా గురించి అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ సినిమాని అనిల్ సుంక‌ర నిర్మించ‌నున్నారు. ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించే అవ‌కాశం ఉంది.

"స‌రిలేరు నీకెవ్వ‌రూ" అనే పేరుని ప‌రిశీలిస్తున్నారు. ఈ డీటేల్స్ అన్ని ఆ రోజే ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది.