ప్రేమ‌యాత్ర‌లు స‌రే, పెళ్లెప్పుడు?

When will be Nayantara and Vignesh be getting married?
Tuesday, September 18, 2018 - 00:30

లేడీ సూప‌ర్‌స్టార్ న‌య‌న‌తార‌, ఆమె ప్రియుడు విగ్నేష్ దేశ‌, విదేశాల్లో తెగ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. న‌య‌న‌తార ఇపుడు కోలీవుడ్‌లో నెంబ‌ర్‌వ‌న్ హీరోయిన్‌. సినిమాకి మూడు కోట్ల రూపాయ‌ల‌కి త‌క్కువ తీసుకోవ‌డం లేదు. ఆమె డేట్స్ దొర‌కాల‌న్నా క‌ష్టం. ఐతే విగ్నేష్‌తో తీర్థ‌యాత్ర‌ల‌కి, ప్రేమ‌యాత్ర‌ల‌కి మాత్రం రెగ్యుల‌ర్‌గా టైమ్ కేటాయిస్తుంటుంది. 

న‌య‌న‌తార బ‌ర్త్‌డేని సెల‌బ్రేట్ చేసుకునేందుకు ఇటీవల వీరిద్ద‌రూ న్యూయార్క్ వెళ్లి ఎంజాయ్ చేశారు. ఇక ఇపుడు విగ్నేష్ బ‌ర్త్‌డే కోసం అమృత్‌స‌ర్ వెళ్లారు. అక్క‌డ గోల్డెన్ టెంపుల్‌ని ద‌ర్శించుకొన్నారు. నయ‌న‌తార‌కి ఎపుడు ఖాళీ దొరికినా..ఆమె విగ్నేష్‌ని తీసుకొని ఏదో ఒక ప్లేస్‌కి వెళ్తోంది. పుణ్యం, పురుషార్థం కావాల‌నే ఉద్దేశంతో..అటు ఒక‌సారి పుణ్య‌క్షేత్రాల‌కి, మ‌రోసారి విదేశాల‌కి వెళ్తున్నారు.

ఇంత‌కీ పెళ్లి ఎపుడు? ఆ విష‌యంలో మాత్రం ఇద్ద‌రూ పెద‌వి విప్ప‌డం లేదు. ఐతే వీరిద్ద‌రికీ ఇప్ప‌టికే నిశ్చితార్థం జ‌రిగింద‌నేది వాస్త‌వం. ఆ మాట న‌య‌న‌తారే ఇటీవ‌ల బ‌య‌ట‌పెట్టింది. మ‌రి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకోవ‌డంలో ఎందుకు ఆల‌స్య‌మో!