లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ ఎపుడు?

When will Lakshmi's NTR get censor clearance?
Saturday, March 23, 2019 - 14:15

"ల‌క్ష్మీస్ ఎన్టీఆర్" సినిమా విడుద‌ల‌ని ఆపాలంటూ అప్పీల్ అయిన పిటీష‌న్‌ని తెలంగాణ హైకోర్టు తిర‌స్క‌రించింది. విడుద‌ల‌ని ఆప‌బోమ‌ని, వాక్ స్వేచ్ఛ‌ని అడ్డుకోబోమ‌ని కోర్టు తేల్చిచెప్పింది. ఐతే కోర్టు సినిమా రిలీజ్‌ని ఆప‌బోమ‌ని మాత్ర‌మే చెప్పింది కానీ సెన్సార్ బోర్డుకి ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. రిలీజ్‌ని అడ్డుకోవ‌డం అనేది ఒక అంశం, సెన్సార్ బోర్డు క్లియ‌ర్ చేయ‌డం మ‌రో అంశం. ఈ రెండు వేర్వేరు అంశాలు. సెన్సార్ బోర్డు నుంచి క్లియ‌రెన్స్ వ‌స్తేనే సినిమా విడుద‌ల అవుతుంది.

మార్చి 29న విడుద‌ల కావాల్సిన ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు సెన్సార్ కాలేదు. సోమ‌వారం కానీ, మంగ‌ళ‌వారం కానీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి అవుతాయ‌ని వ‌ర్మ ధీమాగా ఉన్నాడు. అందుకే మార్చి 29న రిలీజ్ అవుతుంద‌ని గ‌ట్టిగా చెపుతున్నారు.

సెన్సార్ క్లియ‌రెన్స్ వ‌స్తేనే సినిమా రిలీజ్ ఉంటుంది.