సినిమా ఉన్న‌ది స‌రే.. ఎపుడు మొద‌ల‌వుతుంది?

When will Rana's Hiranya Kashyapa start?
Sunday, June 2, 2019 - 19:30

"రుద్ర‌మ‌దేవి" ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా త‌న తదుప‌రి చిత్రం రానా హీరోగా "హిర‌ణ్య‌క‌శ్య‌ప" అని ప్ర‌క‌టించాడు. కానీ ఇందులో కొత్త న్యూస్ ఏముంది. రెండేళ్లుగా అనేక‌సార్లు ఈ సినిమా గురించి మీడియా రాసింది. గుణ‌శేఖ‌ర్ కొత్త‌గా చెప్పింది ఏమి లేదు.

ఈ సినిమా ఎపుడు మొద‌ల‌వుతుందో చెప్ప‌లేదు. నిర్మాత ఎవ‌రో వివ‌రించ‌లేదు. బ‌డ్జెట్ ఊసు లేదు. రానా హీరో, ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్‌. పౌరాణిక చిత్రం. ఇంతే చెప్పారు. ఇది వెరీ ఓల్డ్‌న్యూస్‌.

అస్స‌లు రానా ఏ సినిమా చేస్తున్నాడు? ఏ సినిమా ఎపుడు విడుద‌ల చేస్తాడు? వ వీటి విష‌యంలో ఎవ‌రికైనా క్లారిటీ ఉంది. గ‌తేడాది తీవ్ర అనారోగ్యానికి గురైన రానా... కేవ‌లం "క‌థానాయ‌కుడు", "మ‌హానాయ‌కుడు" సినిమాలో నారా చంద్ర‌బాబునాయుడు పాత్ర‌లో క‌నిపించాడు. రెండు సినిమాలు ఢ‌మాల్ అన్నాయి. చంద్ర‌బాబునాయుడు అధికారం కోల్పోయారు. ఐనా రానా తాను హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా విడుద‌ల ఎపుడో, త‌ర్వాత ఏది ఎపుడు మొద‌లుపెడుతానో వివ‌రించ‌డం లేదు. 

వేణు ఉడుగుల ద‌ర్శ‌క‌త్వంలో "విరాట ప‌ర్వం", గుణ‌శేఖ‌ర్ డైర‌క్ష‌న్‌లో "హిర‌ణ్య‌క‌శ్య‌ప" చిత్రాలు ఒప్పుకున్న వార్త‌లు చాలా పాత‌వి. మొద‌లు ఎపుడు అనేదే అస‌లు వార్త‌. మ‌రి ఆ వివ‌రం వ‌చ్చెదెపుడు?