ఈ భామ ఏమైపోయింది?

Where is Pragya Jaiswal?
Monday, July 1, 2019 - 12:30

ఒక‌పుడు తెగ హంగామా చేసిన ప్ర‌గ్యా జైస్వాల్ ఉన్న‌ట్టుండి టాలీవుడ్ సీన్ నుంచి మాయ‌మైంది. ఆచారి అమెరికా యాత్ర విడుద‌ల‌కి ముందు నుంచే ప్ర‌గ్యా పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. అవకాశాల కోసం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు కూడా లేదు.

మిర్చిలాంటి కుర్రోడు అనే చిన్న సినిమాలో న‌టించిన ఆమె టాలెంట్‌ని క్రిష్ క‌నిపెట్టాడు. వెంట‌నే వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న కంచె సినిమాలో ఆమెకి ఛాన్స్ ఇచ్చాడు. క్రిష్ సినిమాలో నటించిన హీరోల‌కి, హీరోయిన్ల‌కి మంచి పేరు వ‌స్తుంది క‌దా. అలా కంచె సినిమాతో మంచి బ్రేక్ తెచ్చుకొంది.  ఆ త‌ర్వాత ఓం న‌మో వెంక‌టేశాయ, న‌క్ష‌త్రం, జ‌య‌జాన‌కీనాయ‌క‌, గుంటూరోడు వంటి సినిమాల్లో న‌టించింది. కానీ ఒక్క‌టీ కూడా ఆడ‌లేదు. ఆమె న‌ట‌న‌కి పేరు రాలేదు.

సైరా సినిమాలో మాత్రం చిన్న పాత్ర‌లో మెర‌వ‌నుంది. కొన్ని వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్లే ఆమె సినిమాలు త‌గ్గించింద‌నే గుస‌గుస‌. అందులో నిజ‌మెంత‌? అన్న‌ట్లు ట్విట్ట‌ర్‌లో ఆమె ఇలాంటి ఫోటోల‌ను అప్‌డేట్ చేస్తోంది. ఇది తాజాగా షేర్ చేసిన ఫోటోనే.