సాహో మొద‌టి పాట త‌నిష్క్ ఖాతాలో

Who composed Psycho Saiyaan for Saaho?
Thursday, July 4, 2019 - 15:00

"సాహో" సినిమాకి తాము సంగీతం అందించ‌డం లేద‌ని చాలా రోజుల క్రిత‌మే త‌ప్పుకున్నారు శంక‌ర్ ఇషాన్ లాయ్‌. ఒక్కో పాట‌కి ఒక్కో సంగీత ద‌ర్శ‌కుడిని తీసుకుంటామ‌ని, మీరు రెండు పాట‌లు చేస్తే చాలు అని శంక‌ర్ ఇషాన్ లాయ్‌కి చెప్పారు సాహో మేక‌ర్స్‌. దాంతో ఒళ్లు మండిన శంక‌ర్ ఇషాన్ లాయ్ త‌ప్పుకున్నారు. ఐతే వారు త‌ప్పుకునే టైమ్‌కి ఆల్రెడీ మూడు పాట‌లు రికార్డు చేశారు. మ‌రి ఆ పాట‌ల‌ను ఏమి చేస్తారో అనేది చూడాలి.

తాజాగా మొద‌టి పాట‌గా సైకో స‌య్యా అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ని విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది సాహో టీమ్‌. రీసెంట్‌గా ల‌వ్ యాత్రి, కేస‌రి వంటి సినిమాల‌కి సూప‌ర్‌హిట్ సాంగ్స్ అందించిన యువ సంగీత సంచ‌ల‌నం త‌నిష్క్ బాగ్చీ ఈ పాట‌ని కంపోజ్ చేశాడ‌ని అంటున్నారు. పోస్ట‌ర్స్ కూడా అత‌ని పేరు లేదు. బ‌హుశా పాట విడుద‌లైన‌పుడు ప్ర‌క‌టిస్తారేమో పేరును.

తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాకి నలుగురు సంగీత ద‌ర్శ‌కుల పేర్ల‌ను యాడ్ చేస్తున్నార‌ట‌. ఓ విదేశీ సంస్థ నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ట్రాక్స్‌ని కొన్నారు. వాటిని కాస్త మార్చే బాధ్య‌త‌ని జీబ్రాన్‌కి అప్ప‌గించారు. అందుకే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌గా జీబ్రాన్ పేరు వేయ‌నున్నారు. ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది