బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఇతడేనా

Who will be eliminated first from Bigg Boss 3
Saturday, July 27, 2019 - 15:30

బిగ్ బాస్ సీజన్ 3 రోజురోజుకు హాట్ గా మారుతోంది. ఇప్పటికే కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం పెరగగా... మరోవైపు ఫస్ట్ ఎలిమేషన్ కు రంగం సిద్ధమైంది. ఈసారి హౌజ్ నుంచి అందరికంటే ముందు బయటకు వెళ్లేది ఎవరనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నడుస్తున్న సినారియో ప్రకారం చూసుకుంటే.. హౌజ్ నుంచే ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చెప్పడం కష్టంగా మారింది. 

కానీ బిగ్ బాస్ సీజన్స్ ను రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్లు మాత్రం ఈ విషయంపై ఓ అవగాహనతో ఉన్నారు. సోషల్ మీడియాలో వీళ్లంతా చెబుతున్న అభిప్రాయాల ప్రకారం.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. దీనికి వీళ్లు చెప్పే రీజన్స్ కూడా సహేతుకంగానే ఉన్నాయి. 

బిగ్ బాస్ హౌజ్ లో ముందుగా గమనించేది సహనం మాత్రమే. ఎవరు ఎక్కువ సహనంగా ఉన్నారనేది మొదటి ప్రయారిటీ. ఇలా సహనం కోల్పోయిన కారణంగానే సీజన్-1 నుంచి జ్యోతి ముందుగా ఎలిమినేట్ అయింది. సీజన్-2 నుంచి సంజన కూడా ఎలిమినేట్ అయింది. వీళ్లిద్దరూ తన నోటిదురుసు కారణంగానే హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. 

సరిగ్గా ఇవే లక్షణాలు ఇప్పుడు రాహుల్ లో కనిపిస్తున్నాయి. సో.. బిగ్ బాస్ ఫాలోవర్స్ అంచనాలు కరెక్ట్ అయితే హౌజ్ నుంచి ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది రాహుల్ మాత్రమే. త్వరలోనే ఈ సస్పెన్స్ కు తెరపడనుంది.