ఎన్టీఆర్‌కి ఏ ఫారిన్ భామ సెట్ట‌య్యేనో

Who will pair up with NTR in RRR
Tuesday, July 23, 2019 - 15:30

జూనియ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న "ఆర్‌.ఆర్‌.ఆర్" షూటింగ్ కొత్త షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో త‌మిళ‌నాడులో జ‌ర‌గ‌నుంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ సినిమాని తీయ‌నున్నారు. అలా చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేశారు రాజ‌మౌళి. ప్రస్తుతానికి హీరోయిన్ల‌తో అవ‌స‌రం లేని సీన్లే చిత్రీక‌రిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌పై కాంబినేష‌న్‌లు తీశారు. అలాగే ఇద్ద‌రి సీన్లు సోలోగా కూడా చిత్రీక‌రించారు.

ఐతే వ‌చ్చే నెల నుంచి మొద‌ల‌య్యే షెడ్యూల్స్ నాటికి ఇద్ద‌రు హీరోయిన్లు షూటింగ్‌లో జాయిన్ అవాల్సి ఉంటుంది. ఎవ‌రా ఇద్ద‌రు హీరోయిన్లు?

రామ్‌చ‌ర‌ణ్‌కి బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్ హీరోయిన్‌గా ఎపుడో సెట్ అయింది. జూనియ‌ర్ ఎన్టీఆర్‌కే ఇంకా జోడి కుద‌ర‌లేదు. మొద‌ట డైసీ అనే బ్రిటీష్ భామ‌ని తీసుకున్నారు. కానీ ఆమె త‌ప్పుకొంది. ఆమె స్థానంలో మ‌రో భామ కోసం ఇంకా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కాస్త పేరున్న ఫారిన్ యాక్ట్రెస్‌ని తీసుకోవాల‌నుకుంటున్నార‌ట‌. అందుకే ఇంత లేట్ అవుతోంది. ఐతే ఆగ‌స్ట్ చివ‌రినాటికి ఎవ‌రో ఒక భామ‌ని ఫైన‌లైజ్ చేస్తార‌ట‌.

"ఆర్‌.ఆర్‌.ఆర్" అనే పేరుతో రూపొందుతోన్న ఈ మూవీకి ఫుల్ టైటిల్‌ని రఘుప‌తి రాఘ‌వ రాజారాం అని అనుకుంటున్నారు. అజ‌య్ దేవ‌గ‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లోక‌నిపించ‌నున్నాడు. దాదాపు 350 కోట్ల‌తో తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి దానయ్య నిర్మాత‌.