బాల‌య్య‌ని అవ‌మానించిన ఫ్యాన్స్‌

Why Balakrishna fans stayed away from Mahanayakudu
Saturday, February 23, 2019 - 15:30

నందమూరి బాల‌కృష్ణ‌కి అభిమానుల సంఖ్య మామూలుగా లేదు. సీమ‌లోనూ, ఆంధ్రాలోనూ కోసుకునే ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే బాల‌య్య శ‌తాధిక చిత్రాల హీరో అయ్యారు. ఎన్నో ఇండ‌స్ట్రీ హిట్స్ ఇచ్చారు. అలాంటి బిగ్ హీరో న‌టించిన సినిమాకి మొద‌టి రోజు కోటి రూపాయ‌ల షేర్ రావ‌డం అంటే అంత‌క‌న్నా అవ‌మానం మ‌రోటి ఉండదు.

రాంగోపాల్ వ‌ర్మ తీసిన ఆఫీస‌ర్‌కి మొద‌టి రోజు కోటిన్న‌ర వ‌చ్చిందంటే అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే వ‌ర్మ సినిమాల అంటే జ‌నాలు భ‌య‌ప‌డే ప‌రిస్థితి ఏర్ప‌డింది. అందుకే ఆయ‌న సినిమాని చూసేందుకు నాగార్జున అభిమానులు కూడా ద‌డుసుకున్నారు అనుకోవ‌చ్చు. కానీ ఇక్క‌డ సీన్ వేరు. న‌టించింది బాల‌య్య‌. పైగా సినిమా బాల‌య్య స్వ‌యంగా నిర్మించిన ఎన్టీఆర్ బ‌యోపిక్‌. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావు అభిమానులు, తెలుగు దేశం పార్టీ కార్య‌క‌ర్తులు ప‌ట్టించుకున్నా.. మొద‌టి రోజు ఇంత ఘోర అవ‌మానం జ‌రిగిదే కాదు.

బాల‌య్య అభిమానులు కూడా థియేట‌ర్ల వైపు ముఖం చూపించ‌లేదంటే..స‌మ్‌థింగ్ ఏదో ఉంది.