బాల‌య్య ముహూర్తం మారింది

Why Balayya - K S Ravikumar film postponed?
Sunday, May 19, 2019 - 00:30

నంద‌మూరి బాల‌కృష్ణ మొన్నే బోయ‌పాటికి షాక్ ఇచ్చాడు. బోయ‌పాటి సినిమాని ప‌క్క‌న పెట్టి త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ డైర‌క్ష‌న్‌లో మొద‌ట సినిమాని చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. సి క‌ల్యాణ్ నిర్మాత‌గా ఈ సినిమా మే 17న ప్రారంభం అవుతుంద‌ని అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. మే 17 వ‌చ్చింది, పోయింది కానీ సినిమా ప్రారంభం కాలేదు. ఎందుకు?

అంటే బాల‌య్య - కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమా ఆగిపోయిందా? లేక ముహూర్తం మారిందా?

అస‌లు విష‌యం ఏంటంటే... బాల‌య్య రీసెంట్‌గా మ‌న‌సు మార్చుకున్నాడ‌ట‌. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన త‌ర్వాత కొంత గ్యాప్ తీసుకొని సినిమా ముహూర్తం ఫిక్స్ చేసుకుందామ‌ని భావిస్తున్నాడ‌ట‌. అందుకే కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమా ముహూర్తాన్ని మార్చారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే... బాల‌య్య బ‌ర్త్‌డే (జూన్ 10) త‌ర్వాత లాంచ్ ఉంటుంది.