రాజ‌మౌళి అమెరికా వెళ్లింది అందుకేనా?

Why Did Rajamouli go for USA
Saturday, July 6, 2019 - 09:30

అగ్ర ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ఇపుడు అమెరికాలో ఉన్నారు. అదీ కూడా వాషింగ్ట‌న్ డీసీ న‌గ‌రంలో. ప్ర‌స్తుతం తానా స‌భ‌లు కూడా అదే సిటీలో జ‌రుగుతున్నాయి. అక్క‌డే ఉండి ...రాజ‌మౌళి తానా స‌భ‌ల్లో ఎందుకు పాల్గొనడం లేదు. ఈ డౌట్ అంద‌రికీ వ‌స్తుంది. ఐతే మాకు తెలిసిన స‌మాచారం ప్ర‌కారం రాజ‌మౌళి వాషింగ్ట‌న్‌కి వెళ్లిన రీజ‌న్ వేరు.

తానా స‌భ‌ల్లో మ్యూజిక‌ల్ షో నిర్వ‌హిస్తున్నారు ఎం.ఎం.కీర‌వాణి. ఆయ‌న తానాలో క‌చేరి కోసం వాషింగ్ట‌న్ వెళ్ల‌డంతో..రాజ‌మౌళి, ఇత‌ర కుటుంబ స‌భ్యులంతాక‌లిసి అమెరికా వెళ్లారు. ఎందుకంటే జులై 4న‌..కీర‌వాణి బ‌ర్త్‌డే. కీర‌వాణి పుట్టిన‌రోజు నాడు వారు కుటుంబ స‌భ్యులంతా క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటారు. ఈ సారి హైద‌రాబాద్‌లో కీర‌వాణి లేక‌పోవ‌డంతో..నాలుగో తేదీనాడు అమెరికాలో ఉండేలా రాజ‌మౌళి, వారి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్లాన్ చేసుకున్నార‌ట‌.

అంటే కేవ‌లం బ‌ర్త్‌డే విషెష్ తెలిపేందుకు అమెరికా వెళ్లాడు రాజ‌మౌళి. అది ఆ అన్నాద‌మ్ముల అనుబంధం.