ప్రభాస్ ఎందుకు వెనకబడ్డాడు?

Why Prabhas is lagging in desirable list?
Thursday, March 19, 2020 - 13:45

"బాహుబలి"లో ఒక హీరోయిజం ఎలివేటింగ్ సీన్ ఏంటంటే.. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివ లింగాన్ని ఎత్తి, ఆ తర్వాత సాంగ్ అందుకోవడం. ఆ సీన్ లో ప్రభాస్ బాడీని చూసి అమ్మాయిలు ఫిదా అయ్యారు. ముఖ్యంగా నార్త్ ఇండియాకి చెందిన అమ్మాయిలు, సోషల్ మీడియా క్వీన్స్ .... ట్విట్టర్లో అప్పుడు ఆ ఫోటోలు పెట్టి ప్రేమ అంతా ఒలకబోశారు. ఆ తర్వాత ఏడాది... టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించిన 'ది మోస్ట్ డిజాయిరబుల్ మెన్" లిస్ట్ లో చేరాడు ప్రభాస్. అది కూడా నేషనల్ లెవల్ లిస్ట్ లో. 

తర్వాత ఏడాది కొంత స్థానం తగ్గింది. ఆ తర్వాత ఇంకొంత స్లిప్ అయింది. ఈ ఏడాది మరి బాగా దిగజారింది. ఇక హైదరాబాద్ లిస్ట్ లో కూడా నాలుగో స్థానానికి చేరిపోయాడు. మొదటి స్థానంలో విజయ్ దేవరకొండ, రెండో స్థానంలో చరణ్ నిలిచారు. 

ప్రభాస్ స్థానం ఎందుకు వెనుకబడింది? "సాహో" సినిమాలో ప్రభాస్ కన్సిస్టెన్సీ లేని లుక్స్ చూసిన ఎవరైనా ఆయన స్థానం ఇంకా తగ్గినా ఆశ్చర్యపోరు. అంతే కాదు.. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టార్ డమ్ పెరిగింది కానీ అమ్మాయిలలో మునుపటి క్రేజ్ లేదు. ప్రభాస్ తన కొత్త సినిమాతో అయినా మరోసారి అమ్మాయిలను ఫిదా చేస్తాడా అనేది చూడాలి.