ప్రభాస్ మౌనం వెనుక కారణం అదే!

Why Prabhas is remaining silent on Saaho?
Saturday, September 14, 2019 - 16:00

సాహో సినిమా విడుదలకి ముందు ప్రభాస్‌ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రమోషన్లకి దూరంగా ఉంటాడని పేరు తెచ్చుకున్న ప్రభాసేనా ఇంత హడావుడి చేస్తున్నది అని ఆశ్చర్యపోయేలా చేశాడు. దాదాపు వంద మీడియా సంస్థలకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. చెన్నై, కొచ్చి, బెంగుళూర్‌, ముంబై, హైదరాబాద్‌ అన్ని చోట్లా మీడియాతో ఇంటారాక్ట్‌ అయ్యాడు. నార్త్‌లోనూ పలు సిటీస్‌ చక్కర్లు కొట్టాడు. ప్రమోషన్‌కి ఎంత చేయాలో అంత చేశాడు.

కానీ సినిమా విడుదల తర్వాత ఎక్కడి వారు అక్కడ గప్‌చుప్‌. దర్శకుడు సుజీత్‌ నోరు విప్పలేదు. నిర్మాతలు కూడా ఎటువంటి ఈవెంట్‌ కండక్ట్‌ చేయలేదు. ప్రభాస్‌ది సేమ్‌ సీన్‌. ఇటీవల గోపిచంద్‌ కుటుంబానికి చెందిన కార్యక్రమంలో పాల్గొనడం మినహా ప్రభాస్‌... మళ్లీ బయట దర్శనం ఇవ్వలేదు. సాహో గురించి పెదవి విప్పలేదు.

ప్రభాస్‌ మౌనం దేనికి సంకేతం? మళ్లీ కొత్త సినిమా ప్రమోషన్స్‌ అపుడే మాట్లాడుతాడట. అప్పటి వరకు మీడియా ఏమీ రాసుకున్నా...రాసుకొనివ్వాలని అనేది వదిలేశాడట. రిలీజ్‌కి ముందు చేయాల్సిందంతా చేశామ కాబట్టి రిలీజ్ తర్వాత చేయగలిగిదేమీ లేదని ఊరుకున్నాడట. పైగా సినిమాకి పాజిటివ్‌ టాక్‌ రాలేదు. వచ్చిన కలెక్షన్లు అన్ని ప్రభాస్‌ మేనియా, క్రేజ్‌ వల్ల దక్కినవే. హాలీడేస్‌ తర్వాత సినిమా ఢమాల్‌ అని పడిపోయింది. అందుకే సైలెంట్‌గా ఉండిపోయాడు.