తర్వాత పూరి కవర్‌ చేసింది అందుకేనా?

Why Puri posted new pic after Charmee released pics?
Tuesday, September 17, 2019 - 14:30

చార్మి, పూరి ..ఇద్దరూ పార్ట్‌నర్స్‌. సినిమా నిర్మాణంలో ఇద్దరూ చేతులు కలిపి మంచి రిజల్ట్‌ చూశారు రీసెంట్‌గా. ఇస్మార్ట్‌ శంకర్‌ హిట్‌ కావడం వెనుక పూరి బుర్రతో పాటు చార్మి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ఉందట. సినిమా హిట్‌ కావడంతో పూరికి రేంజ్‌ రోవర్‌ కారు గిప్ట్‌గా ఇచ్చింది. తనకి బిఎండబ్ల్యూ కారు కొనుక్కొంది. ఇదంతా ఒకే. హిట్‌ ఇచ్చిన దర్శకుడికి నిర్మాతలు కార్లు గిఫ్ట్‌గా ఇవ్వడం టాలీవుడ్‌లో వెరీ కామన్‌. 

ఐతే ఆ తర్వాత వీరు దిగిన ఫోటోలు, ఫోజులు ఇచ్చిన విధానంపైనే చర్చ జరిగింది. ఇద్దరూ అచ్చంగా రియల్‌ లైఫ్‌ పార్ట్‌నర్స్‌లానే ఫోజులిచ్చారే అనే కామెంట్స్‌ పడ్డాయి. దాంతో హడావుడిగా పూరి తన భార్యతో ఆ కారు ముందు దిగిన ఫోటోని షేర్‌ చేశాడు. ఆ విధంగా పుకార్లకి చెక్‌ పెట్టే ప్రయత్నం చేశాడన్నమాట.

ఐతే పూరి, చార్మిల ఫ్రెండ్సిప్‌ గురించి చాలా కాలంగానే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పూరి, చార్మి మాత్రం తాము నిర్మాణ సంస్థలో పార్ట్‌నర్స్‌ అని చెప్పుకుంటున్నారు.