కంగ‌నాకి బిస్కెట్ వేస్తున్న వ‌ర్మ

Why RGV praising Kangana to the hilt?
Wednesday, December 19, 2018 - 17:00

రాంగోపాల్ వ‌ర్మ ఎపుడు ఎవ‌రిని పొగుడుతాడో అర్థం కాదు. ఐతే ఆయ‌న ఎవ‌రిని పొగిడినా..దాని వెనుక ఒక ప‌రమార్థం ఉంటుంది. ఆయ‌న వ్యూహాలు లేట్‌గా అర్థం అవుతాయి. రీసెంట్‌గా ఆయ‌న త‌రుచుగా కంగ‌న ర‌నౌత్‌ని తెగ ప్ర‌శంసిస్తున్నాడు. మ‌ణిక‌ర్ణిక టీజ‌ర్ వ‌చ్చిన‌పుడు ఈ టీజ‌ర్ 2.000 టైమ్స్ అదిరింద‌ని పొగిడాడు.

ఇక తాజాగా మ‌ణిక‌ర్ణిక ట్ర‌యిల‌ర్ విడుద‌ల‌యింది. ఈ ట్ర‌యిల‌ర్ చూసి.. కంగ‌నాని ఓ రేంజ్‌లో మున‌గ‌చెట్టు ఎక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కంగ‌నా చూపిన ఆవేశం, నిప్పులు క‌క్కే ఆ క‌ళ్ల‌లోని తీవ్ర‌త చూస్తే బ్రూస్‌లీ గుర్తొచ్చాడు అట‌. బ్రూస్‌లీ త‌ర్వాత కంగ‌నాలోనే ఆ రేంజ్ ఇంటెన్సిటీని చూశాన‌ని వ‌ర్మ కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

ఐతే వ‌ర్మ ఆమెకిపుడు బిస్కెట్ వేయ‌డం వెనుక రీజ‌నేంటి? ఆమెతో సినిమా ప్లాన్ చేసేందుకే ఇప్ప‌టి నుంచి ఇలా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాడా అన్న డౌట్స్ వ‌స్తున్నాయి.