శ్రీరెడ్డి మ‌ళ్లీ వ‌చ్చింది ఎన్నిక‌ల కోస‌మేనా

Why Sri Reddy has become active again?
Wednesday, February 27, 2019 - 02:30

శ్రీరెడ్డి రాత‌లు, శ్రీరెడ్డి కోతలు....రెండూ అతినే. శ్రీరెడ్డి మాట‌లు, శ్రీరెడ్డి చేష్ట‌లు....రెండూ భరించ‌లేం. కానీ ఆమెకి తెలుసు ఎలా వార్త‌ల్లో నిల‌వాలో. ఏం టార్గెట్ చేస్తే క‌ల‌క‌లం రేగుతుందో అదే చేస్తుంది. గ‌త ఐదారు నెల‌లుగా తెలుగు రాష్ట్రాల‌కి దూరంగా చెన్నైలో ఉంటూ అక్క‌డి సాంబారు తింటూ సాత్వికంగా మారిపోయింద‌నిపించింది. ఐతే తినే నోరు, తిరిగే కాలు ఊరుకోదు అన్న‌ట్లు మ‌ళ్లీ ఆమె ఇపుడు హైద‌రాబాద్‌కి షిప్ట్ అయింది. మ‌ళ్లీ ఎఫ్‌బీలో ఎఫ్ వ‌ర్డ్ సమేతంగా బూతుల ప‌ర్వం అందుకుంటోంది. పాత ఆరోప‌ణ‌లను కొత్త‌గా చేస్తోంది. 

ఆమెకి పీకే అంటే పీక వ‌ర‌కు కోపం ఉంద‌నే జ‌గ‌మెరిగిన స‌త్యం. అందుకే జ‌నసేనాని గురించి ఇప్ప‌టికీ ఘాటుగా పోస్ట్‌లు పెడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి వ్య‌తిరేకంగా ఒక్క ముక్క రాయ‌దు. మ‌ళ్లీ జ‌గ‌న్ గురించి పాజిటివ్‌గా మాట్లాడుతుంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రి తురుపు ముక్క అనేది ఇంకా మిస్ట‌రీగానే ఉంది. 

ఐతే ఆమె ఇపుడు ఉన్న‌ట్లుండి తెలుగునాట యాక్టివ్ కావ‌డంతో.. ఎన్నిక‌ల వేళ క‌ల‌క‌లం సృష్టించేందుకే ఆమె వ‌చ్చింద‌ని అనుమానాలు మొద‌ల‌య్యాయి.